చైనా HMPV వైరస్.. ఇండియాలోకి వచ్చేసింది.. బెంగళూరులో ఫస్ట్ కేసు.. చిన్నారిలో లక్షణాలు

జనం భయపడినట్లే జరిగింది.. చైనాలో విజృంభిస్తున్న హ్యూమన్​ మెటాప్ న్యుమో వైరస్ (HMPV) ఇండియాలోకి వచ్చేసింది. కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరు సిటీలో ఫస్ట్ HMPV వైరస్ గుర్తించారు అక్కడి అధికారులు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది కర్నాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ. బెంగళూరు సిటీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నుంచి వచ్చిన రిపోర్టులు పరిశీలించగా.. ఈ వైరస్ విషయం వెలుగులోకి వచ్చినట్లు వెల్లడించారు అధికారులు.

HMPV వైరస్ ఎటాక్ అయ్యింది.. ఎనిమిది నెలల చిన్న పాప అని.. ప్రస్తుతం ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు వైద్యాధికారులు. బెంగళూరు సిటీలోని నార్త్ ఏరియాలోని ఓ ప్రముఖ బాప్టిస్ట్ ఆస్పత్రికి.. HMPV వైరస్ లక్షణాలతో ఉన్న 8 నెలల చిన్నారి వచ్చినట్లు వివరించారు అధికారులు. ఎనిమిది నెలల చిన్నారి.. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతుందని తెలిపారు. HMPV వైరస్ ముఖ్యంగా 11 ఏళ్లలోపు చిన్నారులకు త్వరగా వ్యాపిస్తుందని స్పష్టం చేశారు డాక్టర్లు. 

భారతదేశంలోని ఫస్ట్ HMPV వైరస్ కేసు అని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం చైనాలోని HMPV వైరస్.. ఇండియాలో నమోదైన HMPV వైరస్ ఒకటేనా లేక వేర్వేరా అనేది తెలియదని కర్నాటక వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. చైనాలోని వైరస్ డేటా అందుబాటులో లేదని స్పష్టం చేసింది. జనవరి 4వ తేదీ ఎలాంటి కేసులు లేవని ప్రకటించింది కర్నాటక ఆరోగ్య శాఖ.. 6వ తేదీ సోమవారం ఫస్ట్ కేసు నమోదు అయినట్లు ప్రకటించటం విశేషం. 

ఇండియాలో నమోదైన ఫస్ట్ HMPV వైరస్ కేసుతో కర్నాటక ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఈ వైరస్ కు ఎటాక్ అయిన చిన్నారి కుటుంబం నివాసం ఉండే ప్రాంతంలో డాక్టర్ల బృందం పరిశీలిస్తుంది. శానిటేషన్ చేస్తున్నారు అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.