హైడ్రామాతో ఆఖరాటకు..కెప్టెన్ రోహిత్‌‌ శర్మ లేకుండా బరిలోకి

 

సిడ్నీ : బోర్డర్‌‌‌‌‌‌– గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకోవాలన్నా.. వరల్డ్ టెస్టు చాంపియన్‌‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసులో నిలవాలన్నా ఆస్ట్రేలియాతో ఆఖరి, ఐదో టెస్టులో టీమిండియా గెలిచి తీరాల్సిందే. కాబట్టి టీమిండియా ఫోకస్ మొత్తం సిడ్నీ టెస్టుపైనే ఉంది.  అయితే  ఈ సిరీస్‌‌లో బ్యాటర్‌‌‌‌గా, కెప్టెన్‌‌ నిరాశ పరిచిన కెప్టెన్‌‌ రోహిత్‌‌ శర్మ లేకుండా బరిలోకి దిగింది. 

డ్రెస్సింగ్‌‌ రూమ్‌‌లో   విభేదాలు ఏర్పడ్డాయన్న పుకార్లతో హైడ్రామా నెలకొంది.  ఇలాంటి నాటకీయ పరిణామాల నేపథ్యంలో హిట్‌‌మ్యాన్‌‌ ఈ మ్యాచ్‌‌కు దూరంగా ఉండటం దాదాపు ఖాయమవగా.. ఆఖరి టెస్టులో ఆస్ట్రేలియాతో చావోరేవో తేల్చుకునేందుకు టీమిండియా రెడీ అయింది. రోహిత్‌‌ గైర్హాజరైతే  అతని స్థానంలో బుమ్రా జట్టు పగ్గాలు చేపట్టాడు.  ఈ సిరీస్‌‌ తొలి మ్యాచ్‌‌లో బుమ్రా కెప్టెన్సీలో అద్భుత విజయం సాధించిన టీమిండియా సిడ్నీలోనూ అలాంటి ఫలితాన్ని పునరావృతం చేసి సిరీస్‌‌ను విజయంతో ముగించాలని చూస్తోంది. ఇంకోవైపు  నాలుగో మ్యాచ్ గెలుపు జోరును కొనసాగిస్తూ  ఆఖరాటలోనూ ఇండియాను ఓడించి బోర్డర్‌‌‌‌–గావస్కర్ ట్రోఫీని తిరిగి సొంతం చేసుకోవాలని ఆస్ట్రేలియా పట్టుదలగా ఉంది. 

రోహిత్‌‌ మౌనంగా..

ఐదో టెస్ట్‌‌‌‌‌‌‌‌లో టీమిండియా  కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ ఆడతాడా? జట్టులో అతని ప్లేస్‌‌‌‌‌‌‌‌ సురక్షితంగానే ఉందా? అంటే  గురువారం జరిగిన మీడియా సమావేశంలో చీఫ్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌ గౌతమ్‌‌‌‌‌‌‌‌ గంభీర్‌‌‌‌‌‌‌‌ మాత్రం దీనికి నాటకీయంగా సమాధానం చెప్పాడు.  పిచ్‌‌‌‌‌‌‌‌ను చూసిన తర్వాత తుది జట్టును ఖరారు చేస్తామని ప్రకటించాడు. దీంతో ఫామ్‌‌‌‌‌‌‌‌లో లేని రోహిత్‌‌‌‌‌‌‌‌ ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు అందుబాటులో ఉండటం లేదనే అనుమానాలు మొదలయ్యాయి.  ఆ తర్వాత జరిగిన పరిణామాలు దీనికి బలం చేకూర్చాయి. సెంటర్‌‌‌‌‌‌‌‌ పిచ్‌‌‌‌‌‌‌‌ను పరిశీలించేందుకు గంభీర్‌‌‌‌‌‌‌‌.. బుమ్రాతో కలిసి రాగా  కొద్దిసేపటి తర్వాత రోహిత్‌‌‌‌‌‌‌‌ జాయిన్‌‌‌‌‌‌‌‌ అయ్యాడు.

ఈ ముగ్గురు కలిసి చాలాసేపు పిచ్‌‌‌‌‌‌‌‌ను పరిశీలించినా కోచ్‌‌‌‌‌‌‌‌, కెప్టెన్ ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు.  గౌతీ ఎక్కువగా బుమ్రాతో మాట్లాడగా, రోహిత్‌‌‌‌‌‌‌‌ మౌనంగా ఉన్నాడు. చీఫ్‌‌‌‌‌‌‌‌ సెలెక్టర్‌‌‌‌‌‌‌‌ అజిత్‌‌‌‌‌‌‌‌ అగార్కర్‌‌‌‌‌‌‌‌, బుమ్రాతో రోహిత్‌‌‌‌‌‌‌‌ మాట్లాడాడు. అందరికంటే చివరగా నెట్‌‌ ప్రాక్టీస్‌‌కు వచ్చిన రోహిత్‌‌ కొద్దిసేపు మాత్రమే బ్యాటింగ్‌‌ చేశాడు. టీమ్ ఫీల్డింగ్ డ్రిల్స్​లోనూ రోహిత్ పాల్గొనలేదు.  ఫస్ట్, సెకండ్‌‌‌‌‌‌‌‌, థర్డ్‌‌‌‌‌‌‌‌ స్లిప్స్‌‌‌‌‌‌‌‌లో వరుసగా కోహ్లీ, రాహుల్‌‌‌‌‌‌‌‌, నితీశ్‌‌‌‌‌‌‌‌ వచ్చారు. జైస్వాల్‌‌‌‌‌‌‌‌ గల్లీ పొజిషన్‌‌‌‌‌‌‌‌లో ఫీల్డింగ్‌‌‌‌‌‌‌‌ చేశాడు.