రాంచీ : ఆసియా గేమ్స్‌లో మూడో స్థానంలో నిలిచి నిరాశపరిచిన ఇండియా విమెన్స్ హాకీ టీమ్ ఇప్పుడు సొంతగడ్డపై ఎఫ్‌ఐహెచ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్ టోర్నీలో పారిస్ ఒలింపిక్ బెర్తే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. శనివారం జరిగే తొలి మ్యాచ్‌లో అమెరికాతో పోటీ పడనుంది. ఈ టోర్నీలో ఆతిథ్య ఇండియా, జర్మనీ, చెక్ రిపబ్లిక్, ఇటలీ, జపాన్, యూఎస్ఏ, చిలీ, న్యూజిలాండ్ బరిలో ఉన్నాయి.
టాప్3లో నిలిచిన జట్లకు పారిస్ బెర్త్ లభిస్తుంది. ఇండియా పూల్–బిలో న్యూజిలాండ్, ఇటలీ, యూఎస్‌ఏతో పోటీ పడుతోంది. ఆరో ర్యాంకర్ ఇండియా గ్రూప్‌లో తమకంటే తక్కువ ర్యాంకర్స్ అయిన మిగతా మూడు జట్లను ఓడించి సెమీస్‌కు వెళ్లాలని చూస్తోంది. 14న న్యూజిలాండ్‌తో, 16న ఇటలీతో పోటీ పడనుంది.
