అంత గొప్ప ఆట  నా లైఫ్ లో చూడలే..

అంత గొప్ప ఆట  నా లైఫ్ లో చూడలే..
  • ఆసీస్‌‌ గడ్డపై కుర్రాళ్ల పెర్ఫామెన్స్​ సూపర్‌‌
  • క్రికెట్‌‌ లెజెండ్‌‌ కపిల్‌‌ దేవ్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు:  ఆస్ట్రేలియాపై హిస్టారికల్‌‌ టెస్టు సిరీస్‌‌ విక్టరీలో కుర్రాళ్లతో కూడిన టీమిండియా అద్భుతంగా ఆడిందని క్రికెట్‌‌ లెజెండ్‌‌ కపిల్‌‌ దేవ్‌‌ కితాబిచ్చాడు. సిరీస్‌‌ అత్యద్భుతంగా సాగిందన్నాడు. ఇండియా టీమ్‌‌లో ప్రతీ ప్లేయర్‌‌ ప్రాణం పెట్టి ఆడారని కొనియాడాడు.  టీమ్‌‌లో సగం మంది గాయపడినా ఇండియా  అంత గొప్పగా ఆడుతుందని తాను అస్సలు ఊహించలేదని చెప్పాడు. అంత గొప్ప పెర్ఫామెన్స్‌‌ను తన లైఫ్‌‌లోనే చూడలేదని కపిల్‌‌ పేర్కొన్నాడు. ‘ఆసీస్‌‌ గడ్డపై టీమిండియా అద్భుత పెర్ఫామెన్స్‌‌ చేసింది.  కెప్టెన్‌‌,  వరల్డ్‌‌ బెస్ట్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ అయిన విరాట్‌‌ కోహ్లీ, రోహిత్‌‌ శర్మ పూర్తి సిరీస్​కు అందుబాటులో లేరు. పైగా టీమ్‌‌లో సగం కంటే ఎక్కువ మంది ప్లేయర్లు గాయపడ్డారు. షమీ, అశ్విన్‌‌, జడేజా, విహారి, ఉమేశ్‌‌, బుమ్రా  గాయపడ్డారు. అయినా పుంజుకొని అంత గొప్పగా ఆడిన టీమ్‌‌కు హ్యాట్సాఫ్‌‌ చెప్పాల్సిందే’ అని గురువారం ఓ గోల్ఫ్‌‌  కోర్స్‌‌ ప్రమోషనల్‌‌ ఈవెంట్‌‌లో పాల్గొన్న  కపిల్‌‌ చెప్పాడు.  వచ్చే నెలలో ఇంగ్లండ్‌‌తో జరిగే సిరీస్‌‌లోనూ టీమిండియా ఇదే జోరును కొనసాగిస్తుందని దేవ్​ ఆశాభావం వ్యక్తం చేశాడు.

సిరాజ్‌‌ మరో ఐదేళ్లు రాణించాలి

ఆసీస్‌‌ టూర్‌‌లో సిరాజ్‌‌ ఆకట్టుకున్నాడని లెజెండరీ క్రికెటర్ అన్నాడు. కానీ, తను మరో ఐదు సీజన్లు ఇలానే పెర్ఫామ్‌‌ చేయాలన్నాడు.  ఫాస్ట్‌‌ బౌలర్లు త్వరగా గాయాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశాడు.  గత పదేళ్లలో  బుమ్రా, భువనేశ్వర్‌‌, షమీ వంటి చాలా మంది పేసర్లు వెలుగులోకి వచ్చారన్నాడు. కానీ, ఏదో ఒకటైమ్‌‌లో గాయపడ్డారని చెప్పాడు. ఇండియా టీమ్‌‌లో చాలా మంది యంగ్‌‌స్టర్స్‌‌ వెలుగులోకి వస్తున్నారని కపిల్‌‌ అన్నాడు. ‘మా జనరేషన్​లో  గుండప్ప విశ్వనాథ్‌‌, గావస్కర్‌‌  ఆ తర్వాత సచిన్‌‌, రాహుల్‌‌ ద్రవిడ్‌‌ యంగ్​స్టర్స్​గా టీమ్​లోకి వచ్చి అద్భుతంగా ఆడారు.  ప్రస్తుత టీమ్‌‌లో   శుభ్‌‌మన్‌‌ గిల్‌‌, సుందర్‌‌, పృథ్వీ షా నన్ను ఇంప్రెస్‌‌ చేశారు. సుందర్‌‌ నుంచి అలాంటి పెర్ఫామెన్స్‌‌ నేను ఎక్స్‌‌పెక్ట్‌‌ చేయలేదు. అతనితో పాటు గిల్‌‌కు మంచి ఫ్యూచర్‌‌ ఉంది. పృథ్వీ గత రెండేళ్లలో బాగా రాణించాడు’ అని కపిల్‌‌ చెప్పుకొచ్చాడు.

గోల్ఫ్‌‌తో.. నేచర్‌‌కు దగ్గరయ్యా.

క్రికెట్‌‌కు గుడ్‌‌బై చెప్పిన తర్వాత కపిల్‌‌ గోల్ఫర్‌‌ అవతారం ఎత్తాడు. చాలా ఏళ్ల నుంచి ప్రొఫెషనల్‌‌ టోర్నీల్లో ఆడుతున్నాడు. క్రికెట్‌‌ తనకు ప్రాణమైతే, గోల్ఫ్‌‌ పిచ్చి అని కపిల్​ చెప్పాడు.  తనను నేచర్‌‌కు దగ్గర చేసిందన్నాడు.  పచ్చిక, చెట్లు, స్వచ్ఛమైన గాలి ఈ ఆటపై ఇష్టాన్ని మరింత పెంచిందని ఇండియా మాజీ కెప్టెన్​ చెప్పాడు.