విజయవాడలో యూఎస్ వీసా కేంద్రం..!

ఏపీ  ప్రజలకు వీసా కష్టాలు తీరనున్నాయా.. అమెరికా వెళ్లాలనుకునే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ప్రాసెస్ మరింత సులభతరం కానుందా.. అంటే నిజమనే చెప్పొచ్చు. హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ అధికారులు ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు.

విశాఖపట్నం లేదా విజయవాడలో వీసా దరఖాస్తు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని USA పరిశీలిస్తోందని US కౌన్సెలర్ జనరల్ రెబెకా డ్రామే చెప్పారు. యూఎస్ లో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయులు ఎక్కువగా ఉన్నారని అన్నారు. అందులో సగం మంది తెలుగు రాష్ట్రాలనుంచే ఉన్నారని చెప్పారు. మంగళవారం విశాఖలో యూఎస్ కాన్సులేట్ బృందం పర్యటించింది. 

మరోవైపు భారత్ కు యూఎస్ నుంచి వచ్చే  విద్యార్థులు సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందన్నారు. 2023-24లో భారత్ కు వచ్చిన అమెరికా  విద్యార్థుల సంఖ్ 300 శాతం పెరిగిందన్నారు.
2023-24 మధ్య కాలంలో ఉన్నత చదువులకోసం 3.30 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికా వెళ్లారని చెప్పారు. అదేవిధంగా గతేడాది 336 ఉన్న  అమెరికన్ విద్యార్తుల సంఖ్య ఇప్పుడు 1355కి పెరిగిందన్నారు. 

గతేడాది హైదరాబాద్ లో యూఎస్ కాన్సులేట్ ఏపీ, తెలంగాణ, ఒడిశా విద్యార్థులకోసం  స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలు నిర్వహించగా.. ఈఏడాది 47వేల స్టూడెంట్ వీసాలు ఇంటర్వ్యూలు నిర్వహించారు. గతం కంటే 25 శాతం పెరుగుదలను సూచిస్తుంది. 

ఉన్నత చదువులకోసం అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్యరోజురోజుకు పెరుగుతుంది.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలనుంచి ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది.. మెడిసిన్, సైన్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ , మ్యాథమెటిక్స్ లలో ఉన్నత చదువులకోసం అమెరికా వెళ్తున్నారు.

అందుకు అనుగుణంగా విశాఖపట్నంలో వీసా జారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు యూఎస్ కాన్సులేట్ అధికారులు చెప్పారు. దీంతో పాటు కాన్సులేట్ సిబ్బందిని పెంచనున్నట్టు తెలిపారు.