ISSF World Championship 2024: భారత షూటర్లకు  రెండు కాంస్యాలు

న్యూఢిల్లీ: ఇండియా యువ షూటర్లు ఐఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ జూనియర్ వరల్డ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో మరో రెండు పతకాలు గెలిచారు. సోమవారం జరిగిన10 మీటర్ల మిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో గౌతమి భనోత్‌‌‌‌‌‌‌‌, అజయ్ మాలిక్‌‌‌‌‌‌‌‌ జోడీ కాంస్యం గెలిచింది. కాంస్య పతక పోరులో ఇండియా జంట 17–9తో క్రొయేషియా ద్వయాన్ని ఓడించింది. 10 మీటర్ల మిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ ఎయిర్ పిస్టల్‌‌‌‌‌‌‌‌ కాంస్య పతక మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో లక్షిత–ప్రమోద్‌‌‌‌‌‌‌‌ జంట 16–8తో ఇండియాకే చెందిన మనిష్క దాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–నేలవలి జోడీపై నెగ్గింది.