న్యూఢిల్లీ, వెలుగు: దేశ 16వ ఉప రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ ఖరారైంది. ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10తో ముగియనుండడంతో ఆగస్టు 6న ఎన్నిక నిర్వహిస్తున్నట్టు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఆగస్టు 6న ఓటింగ్ జరుగుతుందని తెలిపింది. అదేరోజు కౌంటింగ్ చేసి ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొంది. జులై 5న ఎన్నికల నోటిఫికేషన్విడుదల, జులై 19 నామినేషన్లకు చివరి గడువు అని, 20న నామినేషన్ల పరిశీలన ఉంటుందని పేర్కొంది. నామినేషన్ల విత్డ్రా గడువు జులై 22 వరకు ఉంటుందని తెలిపింది. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రక్షణ చర్యలు తీసుకుంటామని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది.
