ఐపీఎల్ 2025 మెగా వేలం ప్లేయర్ వేలం కోసం మొత్తం 1,574 మంది ఆటగాళ్లు (1,165 మంది భారతీయులు, 409 మంది విదేశీయులు) సైన్ అప్ చేసారు. ఈ జాబితాలో 320 క్యాప్డ్ ప్లేయర్‌లు, 1,224 అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లు, 30 అసోసియేట్ నేషన్స్ ప్లేయర్‌లు ఉన్నారు. మొత్తం 1165 మంది భారత ఆటగాళ్లలో 23 మంది భారత ఆటగాళ్లు రూ. 2 కోట్ల బేస్ ప్రైస్ తో వేలంలో తమ పేరును నమోదు చేసుకున్నారు. అందరూ ఊహించినట్టుగానే ఐపీఎల్ కెప్టెన్లు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఈ లిస్టులో ఉన్నారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి.
-రూ. 2 కోట్ల ప్రాథమిక ధర కలిగిన భారత బ్యాటర్లు:
శ్రేయాస్ అయ్యర్
దేవదత్ పడిక్కల్.
-రూ. 2 కోట్ల ప్రాథమిక ధర కలిగిన భారత ఆల్ రౌండర్లు:
వెంకటేష్ అయ్యర్
కృనాల్ పాండ్యా
వాషింగ్టన్ సుందర్
శార్దూల్ ఠాకూర్
ఆర్ అశ్విన్.
-రూ. 2 కోట్ల ప్రాథమిక ధర కలిగిన భారత వికెట్ కీపర్లు:
రిషబ్ పంత్,
కేఎల్ రాహుల్
ఇషాన్ కిషన్
రూ. 2 కోట్ల ప్రాథమిక ధర కలిగిన భారత బౌలర్లు
ఖలీల్ అహ్మద్, యుజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్, భువనేశ్వర్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ, టి నటరాజన్, ఉమేష్ యాదవ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, మహమ్మద్ షమీ .
Indian players with ₹2 crores base price in the IPL Auction!???? pic.twitter.com/QLai5cwHX0
— CricketGully (@thecricketgully) November 6, 2024