అమెరికాలో రీకాల్ చేస్తున్న మన డ్రగ్స్ ఏవంటే..

అమెరికాలో రీకాల్ చేస్తున్న మన డ్రగ్స్ ఏవంటే..
  • గ్లెన్‌మార్క్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, జూబిలెంట్ కాడిస్టా  డ్రగ్స్


న్యూఢిల్లీ: ప్రముఖ జనరిక్ ఫార్మా కంపెనీలు గ్లెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్  జూబిలెంట్ కాడిస్టాలు అమెరికా మార్కెట్​ నుంచి పలు డ్రగ్స్​ను వెనక్కి (రీకాల్​) రప్పిస్తున్నాయి.  యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యుఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డిఎ)రిపోర్టు ప్రకారం, ముంబైకి చెందిన డ్రగ్ సంస్థ గ్లెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్.. తయారీ సమస్యల కారణంగా 6.5 లక్షల ట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల జనరిక్ స్కిన్ ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఆయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రీకాల్ చేస్తోంది.

కంపెనీ  అనుబంధ సంస్థ అయిన న్యూజెర్సీకి చెందిన గ్లెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇన్​కార్పొరేషన్​, తామర చికిత్సకు ఉపయోగించే టాక్రోలిమస్ ఆయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు "డిఫెక్టివ్ కంటైనర్" కారణంగా ఈ ఏడాది జులై 11 నుంచి దేశవ్యాప్తంగా రీకాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించింది.  సన్ ఫార్మా "ఫెయిల్డ్ డిసోల్యూషన్ స్పెసిఫికేషన్స్" కారణంగా మూర్ఛ చికిత్స మందు డివల్​ప్రోయెక్స్​ సోడియం 9,552 బాటిళ్లను రీకాల్ చేస్తోంది. ఈ లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కంపెనీ గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని హలోల్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తయారు చేశారు. ఈ డ్రగ్ కోసం ఈ ఏడాది జూన్ 27న అమెరికాలో క్లాస్ 2 రీకాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మొదలుపెట్టారు.  డిజొల్యూషన్ స్పెసిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోపాల కారణంగా డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ 5,531 కార్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల లాన్సోప్రజోల్ టాబ్లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను రీకాల్ చేస్తోంది.

న్యూజెర్సీకి చెందిన ఈ సంస్థ జులై 13న దేశవ్యాప్తంగా 11 క్లాస్​ రీకాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించింది. జూబిలెంట్ కాడిస్టా ఫార్మాస్యూటికల్స్ అధిక రక్తపోటు చికిత్సకు ఉపయోగించే 38,160 బాటిళ్ల ఇర్బెసార్టన్ టాబ్లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను (150,  75 ఎంజీ) రీకాల్ చేస్తోంది. ఈ లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జూబిలెంట్ జెనెరిక్స్ రూర్కీ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉత్పత్తి చేసినట్లు యూఎస్​ఎఫ్​డీఏ తెలిపింది. సాలిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బరీకి చెందిన ఈ ఫార్మా కంపెనీ జూలై 18న క్లాస్ 2 రీకాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మొదలుపెట్టింది. అమెరికా జెనరిక్ డ్రగ్స్​ మార్కెట్ 2019లో సుమారు115.2 బిలియన్​డాలర్లు. ఇది ప్రపంచంలోనే ఫార్మా ప్రొడక్టులకు అతిపెద్ద మార్కెట్. పోయిన ఆర్థిక సంవత్సరంలో  భారతదేశం  నుంచి అమెరికాకు ఫార్మా ఎగుమతుల విలువ 24.62 బిలియన్ డాలర్లు. తరువాతి స్థానాల్లో యూకే, దక్షిణాఫ్రికా, రష్యా,  నైజీరియా ఉన్నాయి.