న్యూఢిల్లీ: క్రిప్టో ఎక్స్చేంజిలపై బ్యాన్ వేయడం కంటే నియంత్రణలు విధించడం బెటర్ అని బీజేపీ లీడర్ జయంత్ సిన్హా నాయకత్వంలోని పార్లమెంటరీ ప్యానెల్ భావిస్తోంది. బ్లాక్‌చెయిన్ అండ్ క్రిప్టో అసెట్స్ కౌన్సిల్ మెంబర్లు, సీఐఐ, ఇతర ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్ సంస్థల ప్రతినిధులు ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. క్రిప్టో కరెన్సీల్లో ట్రేడింగ్ చేయడం డేంజర్ అనే వాదనలు వినిపిస్తున్న తరుణంలో ఈ మీటింగ్ జరగడం విశేషం. క్రిప్టో కరెన్సీలు పోంజి స్కీమ్‌లా మారకూడదని ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇండస్ట్రీ ప్రతినిధులను హెచ్చరించింది. క్రిప్టో ఇండస్ట్రీ తప్పుడు యాడ్‌లతో ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి ప్రయత్నించకూడదని తెలిపింది. కాగా, ఇండస్ట్రీ వర్గాలు నియంత్రణలు కావాలని కోరుకుంటున్నాయి. కానీ, సెబీ, ఆర్‌బీఐ లేదా ఇంకేదైన సంస్థ కిందకు ఈ ఇండస్ట్రీని తెస్తారో క్లారిటీ లేదు.
