ఇండియన్ బలగాలు ప్రపంచంలోనే నెం.1 ఐఏఎఫ్ చీఫ్ వీఆర్ చౌదరి

ఇండియన్ బలగాలు ప్రపంచంలోనే నెం.1 ఐఏఎఫ్ చీఫ్ వీఆర్ చౌదరి

న్యూఢిల్లీ: మన దేశ సాయుధ దళాలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవని ఐఏఎఫ్ చీఫ్ ఏయిర్ మార్షల్ వీఆర్ చౌదరి అన్నారు. ఇప్పటికిప్పుడు దేశానికి ఎలాంటి ఆపద వచ్చినా సమర్థంగా తిప్పికొట్టగలిగే సత్తా మన ఆర్మ్​డ్​ ఫోర్సెస్​కు ఉందన్నారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన ఆర్మ్​డ్ ఫోర్సెస్ వెటరన్స్ డే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 90 ఏండ్ల కింద సాధారణ రీతిలో మొదలైన ఐఏఎఫ్​.. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత బలమైన వైమానిక దళాలలో ఒకటిగా ఎదిగిందని చెప్పారు.

ఎంతో మంది అనుభవజ్ఞుల నాయకత్వం, నిరంతర సేవలు ద్వారానే ఇది సాధ్యమైందన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల సేవలను ఎప్పటికీ స్మరించుకుంటామని, వాళ్ల కుటుంబాలకు అండగా ఉంటామని వీఆర్ చౌదరి చెప్పారు. నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ మాట్లాడుతూ.. సాయుధ బలగాల బలోపేతానికి సీనియర్లు చేసిన సేవలు, స్ఫూర్తి, వారసత్వాన్ని కొనసాగిస్తామన్నారు.