IND vs BAN 2024: సగం జట్టు పెవిలియన్‌కు.. రెచ్చిపోతున్న భారత పేసర్లు

చెన్నై టెస్టులో భారత పేసర్లు అదరగొడుతున్నారు. రెండో రోజు ఆటలో బంగ్లాదేశ్ బ్యాటర్లను చక చక పెవిలియన్ కు చేరుస్తున్నారు. బుమ్రా, సిరాజ్, ఆకాష్ దీప్ చెలరేగడంతో ఒక దశలో బంగ్లా 40 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. బుమ్రా, ఆకాష్ దీప్ రెండు వికెట్ల తీసుకోగా.. సిరాజ్ కు ఒక వికెట్ దక్కింది. 

బుమ్రా తొలి ఓవర్ లోనే ఇస్లాం (2) ను క్లీన్ బౌల్డ్ చేయగా..  ఇన్నింగ్స్ 9 ఓవర్ ఆకాష్ దీప్ తొలి బంతికి జాకీర్ హసన్ (3) ను.. రెండో బంతికి మోమినల్ (0) హక్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. లంచ్ తర్వాత సిరాజ్ బంగ్లా కెప్టెన్ శాంటో (20) ను పెవిలియన్ కు పంపగా.. ఫామ్ లో ఉన్న రహీమ్ (8) ను బుమ్రా ఔట్ చేశాడు. ఈ దశలో బంగ్లాను సీనియర్ బ్యాటర్ షకీబ్.. వికెట్ కీపర్ లిటన్ దాస్ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

Also Read:-రోహిత్, సిరాజ్‌కు పంత్ క్షమాపణలు

ప్రస్తుతం బంగ్లాదేశ్ 22 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. క్రీజ్ లో షకీబ్ (20), లిటన్ దాస్ (18) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 300 పరుగులు వెనకపడి ఉంది. అంతకముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్ లో 376 పరుగులకు ఆలౌటైంది. అశ్విన్ సెంచరీ (113) తో చెలరేగగా..  జడేజా (86), జైశ్వాల్ (56) హాఫ్ సెంచరీలతో కీలక ఇన్నింగ్స్ లు ఆడారు. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహమ్మద్ కు ఐదు వికెట్లు దక్కాయి.