Mohammed Siraj: DSPగా బాధ్యతలు స్వీకరించిన సిరాజ్

భారత పేసర్, హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ రాష్ట్ర డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ)గా బాధ్యతలు స్వీకరించాడు. శుక్రవారం రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్‌కు రిపోర్ట్ చేసిన సిరాజ్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించాడు.

Also Read :- పాక్ కెప్టెన్సీ నుంచి షాన్ మసూద్ ఔట్..?

టీ20 ప్రపంచకప్ జట్టులో సభ్యుడైన మహ్మద్ సిరాజ్‌కు గ్రూప్-1 స్థాయి ఉద్యోగమిస్తామని గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాటిచ్చిన విషయం తెలిసిందే. ఒకవేళ పోలీసు శాఖలో చేరాలనుకుంటే డీఎస్పీ వంటి ఉన్నత పదవులలో నేరుగా ప్రవేశం కల్పిస్తుందని చెప్పారు. ఇప్పుడు సిరాజ్ విధుల్లో చేరడంతో ఈ హామీ నెరవేరింది.