టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెబుతున్నట్లు శనివారం సాయంత్రం ప్రకటించాడు. ఈ విషయాన్ని ధోని తన ఇన్స్టాగ్రామ్ పోస్టు ద్వారా వెల్లడించాడు. ఇన్నేళ్ళుగా తనకు మద్దతు పలికిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు .వన్డే, టెస్ట్, టీ20 అన్ని ఫార్మట్ల అంతర్జాతీయ మ్యాచ్‌లకు ధోని గుడ్‌బై చెప్పాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఆడుతున్నాడు ధోనీ. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా ఐపీఎల్లో మాత్రం కొనసాగుతాడు. సెప్టెంబర్‌లో ఐపీఎల్ టోర్నీ జరగనుంది.
