న్యూఢిల్లీ: సత్తా ఉన్న ఇండియన్ కోచ్లకు మరింత చేయూతనిచ్చేందుకు సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న రూ. 2 లక్షల శాలరీ క్యాప్ ను ఎత్తి వేసింది. మరింత బెటర్ రిజల్ట్‌ను రాబట్టాలనే ప్రయత్నంలో భాగంగా ఈ పద్ధతిని తీసుకొచ్చింది. మాజీ ప్లేయర్లను కూడా కోచింగ్ వ్యవస్థలోకి తీసుకురావాలన్నది కూడా దీని ప్రధాన ఉద్దేశం. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఫారిన్ కోచ్ల కాంట్రాక్స్ ట్ను ఎక్స్టెండ్ చేసిన నేపథ్యంలో పై నిర్ణయం తీసుకుంది. ‘కొంత మంది ఇండియన్ కోచ్లు మంచి రిజల్ట్ చూపిస్తున్నారు. వాళ్ల హార్డ్ వర్క్ కు తగిన గుర్తింపు, రివార్డు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎలైట్ ప్లేయర్లకు కోచింగ్ ఇచ్చే విధంగా కంట్రీ వైడ్గా ఉన్న బెస్ట్ కోచింగ్ టాలెంట్ను అట్రాక్ట్ చేయాలని భావిస్తున్నాం. అందుకే శాలరీలపై ఎలాంటి పరిమితులు పెట్టకూడదని నిర్ణయించుకున్నాం. దీనివల్ల డిఫరెంట్ స్పోర్ట్స్ లో మంచి కోచ్ లు జాయిన్ అవుతారు’ అని స్పోర్ట్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు వెల్లడించారు.


