లడాఖ్ లో సైనికుల కోసం.. ఎముకలు కొరికే చలిని ఓడించేలా

లడాఖ్ లో సైనికుల కోసం.. ఎముకలు కొరికే చలిని ఓడించేలా

ఇండియన్ ఆర్మీ సైనికులు  లడాఖ్ లో శీతాకాలంలో విపరీతంగా ఉండే చలిని తట్టుకునేందుకు అవసరమయ్యే దుస్తులను కేంద్రం అమెరికా రక్షణ శాఖ నుంచి భారత్‌ దిగుమతి చేసింది.లడాఖ్ లో భారత భూభాగాన్ని ఆక్రమించుకునేందు చైనా తన సైన్యాన్ని మోహరించిన విషయం తెలిసిందే. చైనాని నిలువరించేలా లడాఖ్ లో సైనికులు విధులు నిర్వహించాలంటే ఎముకలు కొరికే చలిలో శరీరానికి వెచ్చదనాన్ని అందించే దుస్తులు సైన్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. దీంతో కేంద్రం సైనికుల కోసం అమెరికా నుంచి అత్యవసర కొనుగోలు కింద నుంచి 20 వేల సెట్లు కొనుగోలు చేసింది. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో మరో 30 వేల సెట్లు అవసరమయ్యాయి.   ఈ నేపథ్యంలో అమెరికా నుంచి కేంద్రం నుంచి కొనుగోలు చేసిన దుస్తుల్లో భారత సైనికులు దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.