టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇండియా.. జట్టులో మార్పులు ఇవే..

బ్రిస్బేన్ లోని  గబ్బా స్టేడియంలో జరుగుతున్న 3వ టెస్టులో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 5 టెస్టుల సిరీస్ లో డిసైడింగ్ మ్యాచ్ కావడంతో టీమ్ లో స్వల్ప మార్పులు చేసింది రోహిత్ సేన. హర్షిత్ రాణా, రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా ఆడనున్నారు. 

ALSO READ: గబ్బాలో గర్జిస్తారా!..నేటి నుంచి ఇండియా-ఆస్ట్రేలియా మూడో టెస్టు

ఫస్ట్ టెస్టులో 295 రన్స్ తో ఘన విజయం సాధించిన ఇండియాకు.. పింక్ బాల్ టెస్టులో సూపర్ కంబ్యాక్ తో ఆసీస్ షాక్ ఇచ్చింది. దీంతో ఎలాగైనా గెలవాలనే కసితో రోహిత్ సేన రంగంలోకి దిగింది. అదే విధంగా రెండో టెస్టు గెలిచి మంచి ఊపు మీదున్న ఆసీస్.. పింక్ బాల్ టెస్టులో తమ ఆధిక్యం కొనసాగించాలని ప్లాన్ చేస్తోంది.