ఇండియా జోరు సాగేనా..నేడు విండీస్‌‌తో తొలి వన్డే

  •     మ. 1.30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమాలో లైవ్‌‌‌‌

వడోదర : వెస్టిండీస్‌‌‌‌తో మూడు మ్యాచ్‌‌‌‌ల టీ20 సిరీస్‌‌‌‌ను కైవసం చేసుకున్న ఇండియా విమెన్స్‌‌‌‌ టీమ్... ఇప్పుడు వన్డే సిరీస్‌‌‌‌పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఆదివారం ఇరుజట్ల మధ్య తొలి మ్యాచ్‌‌‌‌ జరగనుంది. టీ20 జోరును కొనసాగిస్తూ ఈ సిరీస్‌‌‌‌లోనూ బోణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖాముఖి రికార్డులోనూ ఇండియా 4–1 ఆధిక్యంలో ఉండటం కలిసొచ్చే అంశం. వైస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌, ఓపెనర్‌‌‌‌ స్మృతి మంధాన సూపర్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో ఉండటం సానుకూలాంశం. విండీస్‌‌‌‌తో మూడు టీ20ల్లో ఆమె హాఫ్‌‌‌‌ సెంచరీలు చేసింది.

గత 10 వన్డేల్లోనూ మంధాన 60 సగటుతో 599 రన్స్‌‌‌‌ చేసింది. జెమీమా, రిచా ఘోష్‌‌‌‌ కూడా చెలరేగితే ఇండియా బ్యాటింగ్‌‌‌‌ కష్టాలు తీరినట్లే. బౌలింగ్‌‌లో దీప్తి శర్మ, రేణుకా సింగ్‌‌‌‌, సైమా ఠాకూర్‌‌‌‌ నుంచి విండీస్‌‌‌‌కు ప్రమాదం పొంచి ఉంది. యువ పేసర్‌‌‌‌ టిటాస్‌‌‌‌పై కూడా భారీ ఆశలు ఉన్నాయి. మరోవైపు విండీస్‌‌‌‌ను కూడా తక్కువగా అంచనా వేయడాని వీల్లేదు. కెప్టెన్‌‌‌‌ హీలీ మాథ్యూస్‌‌‌‌, దియోంద్ర డాటిన్‌‌‌‌, క్యాంప్‌‌‌‌బెల్‌‌‌‌ మంచి ఫామ్‌‌‌‌లో ఉన్నారు. అయితే ఇండియా బౌలింగ్‌‌‌‌ను దీటుగా ఎదుర్కోవాలంటే బ్యాటర్లు మరింత శ్రమించాలి.