India Women Vs West Indies Women : 211 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో.. విండీస్‌‌‌‌‌‌‌‌తో తొలి వన్డేలో గ్రాండ్​ విక్టరీ

వడోదరా : ఆల్‌‌‌‌‌‌‌‌రౌండ్‌‌‌‌‌‌‌‌ షోతో ఆకట్టుకున్న ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌.. వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌తో మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌లో భారీ విజయంతో బోణీ చేసింది. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో స్మృతి మంధాన (102 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 13 ఫోర్లతో 91), బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో రేణుకా సింగ్‌‌‌‌‌‌‌‌ (5/29) చెలరేగడంతో.. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా 211 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో విండీస్‌‌‌‌‌‌‌‌ను చిత్తు చేసింది. రన్స్‌‌‌‌‌‌‌‌ పరంగా టీమిండియాకు ఇది రెండో అతిపెద్ద విజయం.  2017లో ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌పై 249 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో నెగ్గిన రికార్డు టాప్‌‌‌‌‌‌‌‌లో ఉంది. ఇక వన్డేల్లో రన్స్‌‌‌‌‌‌‌‌ పరంగా విండీస్‌‌‌‌‌‌‌‌కు ఇదే అతి పెద్ద ఓటమి. టాస్‌‌‌‌‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన ఇండియా 50 ఓవర్లలో 314/9 స్కోరు చేసింది. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో సూపర్‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న మంధాన.. అరంగేట్రం అమ్మాయి ప్రతీకా రావల్‌‌‌‌‌‌‌‌ (40)తో తొలి వికెట్‌‌‌‌‌‌‌‌కు 110, హర్లీన్‌‌‌‌‌‌‌‌ డియోల్‌‌‌‌‌‌‌‌ (44)తో రెండో వికెట్‌‌‌‌‌‌‌‌కు 50 రన్స్‌‌‌‌‌‌‌‌ జత చేసింది. ఈ క్రమంలో విండీస్‌‌‌‌‌‌‌‌పై వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ సాధించింది. గాయం నుంచి కోలుకుని బరిలోకి దిగిన కెప్టెన్‌‌‌‌‌‌‌‌ హర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌ కౌర్‌‌‌‌‌‌‌‌ (34) కూడా నిలకడగా ఆడి డియోల్‌‌‌‌‌‌‌‌తో మూడో వికెట్‌‌‌‌‌‌‌‌కు 66 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించింది. మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌లో రిచా ఘోష్‌‌‌‌‌‌‌‌ (26), జెమీమా (31) కూడా రాణించడంతో ఇండియా భారీ స్కోరు చేసింది. 

విండీస్ బౌలర్లలో జైదా జేమ్స్‌‌‌‌‌‌‌‌ 5, హేలీ మాథ్యూస్‌‌‌‌‌‌‌‌ 2 వికెట్లు తీశారు. తర్వాత ఛేజింగ్‌లో విండీస్‌‌‌‌‌‌‌‌ 26.2 ఓవర్లలో 103 రన్స్‌‌‌‌‌‌‌‌కే కుప్పకూలింది. పేసర్‌‌‌‌‌‌‌‌ రేణుకా సింగ్‌‌‌‌‌‌‌‌ అద్భుతమైన బౌలింగ్‌‌‌‌‌‌‌‌తో విండీస్‌‌‌‌‌‌‌‌ లైనప్‌‌‌‌‌‌‌‌ను కూల్చింది. అఫీ ఫ్లెచర్‌‌‌‌‌‌‌‌ (24 నాటౌట్‌‌‌‌‌‌‌‌) టాప్‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌. హేలీ మాథ్యూస్‌‌‌‌‌‌‌‌ (0), క్వియానా జోసెఫ్‌‌‌‌‌‌‌‌ (0), రషాదా విలియమ్స్‌‌‌‌‌‌‌‌ (3), దియోంద్ర డాటిన్‌‌‌‌‌‌‌‌ (8) నిరాశపర్చడంతో విండీస్‌‌‌‌‌‌‌‌ 11/4తో కష్టాల్లో పడింది. క్యాంప్‌‌‌‌‌‌‌‌బెల్‌‌‌‌‌‌‌‌ (21), అలెనీ (13), కరిష్మా (11) కాసేపు పోరాడారు.  ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో ఏడుగురు సింగిల్‌‌‌‌‌‌‌‌ డిజిట్‌‌‌‌‌‌‌‌కే పరిమితమయ్యారు. ప్రియా మిశ్రా రెండు వికెట్లు పడగొట్టింది. రేణుకకు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. మంగళవారం రెండో మ్యాచ్‌‌‌‌‌‌‌‌ జరగనుంది.

సంక్షిప్త స్కోర్లు

ఇండియా: 50 ఓవర్లలో 314/9 (మంధాన 90, హర్లీన్‌‌‌‌ 44, జైదా జేమ్స్‌‌‌‌ 5/45); వెస్టిండీస్: 26.3 ఓవర్లలో103 ఆలౌట్‌‌‌‌ (అఫీ 24*, రేణుక 5/29).