2025 నాటికి భారత్ ప్రపంచంలోనే ఐదు అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించే ఐదు దేశాల్లో ఇండియా ఉంటుందని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ (సీఈబీఆర్) తెలిపింది.
యూకేకి చెందిన థింక్ థ్యాంక్ సంస్థ ప్రకారం… ప్రస్తుతం యూకే ఐదో ఆర్ధిక వ్యవస్థగా అవతరించగా భారత్ ఆరవ స్థానంలో ఉంది. 2019లో 5వ స్థానంలో ఉన్న భారత్ ను వెనక్కి ఆ స్థానాన్ని యూకే దక్కించుకుంది. ఈ రిపోర్ట్ ప్రకారం 2030నాటికి భారత్ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించనుంది. ప్రస్తుతం ఐదవ స్థానంలో ఉన్న భారత్.., ఆ స్థానాన్ని చేజార్చుకోవడానికి రూపాయి బలహీనపడిపోవడమే ప్రధాన కారణమని తెలుస్తోంది.
అయితే 2020లో భారత్ తన స్థానాన్ని కాపాడుకునేందుకు యూకే తో పోటీ పడినట్లు తెలిపింది. స్వల్పకాలిక పూరగోతి 2021 9శాతం ఉన్న భారత ఆర్ధిక వ్యవస్థ 2022 నాటికి 7శాతం పడిపోతుందనే అభిప్రాయం వ్యక్తం చేసింది. అభివృద్ధి నెమ్మదిగా జరుగుతున్నా ఆర్ధికంగా బలపడుతున్నట్లు సీఈబీఆర్ తన రిపోర్ట్ లో పేర్కొంది. అంతేకాదు Gross domestic product (స్థూల దేశీయోత్పత్తి) 2035నాటికి 5.8 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు అభిప్రాయం వ్యక్తం చేసింది.
యూకే సంస్థ రిపోర్ట్, సీఈబీఆర్ అంచనాల ఆధారంగా 2030నాటికి భారత్ దేశంలో అతిపెద్ద మూడవ ఆర్ధిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉందని ప్రముఖ మీడియా సంస్థ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఆశాభావం వ్యక్తం చేసింది. అంతేకాదు 2025నాటికి యూకేని, 2027 నాటికి జపాన్ ను , 2030నాటికి జపాన్ ను వెనక్కి నెట్టి భారత్ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరిస్తుందని పీటీఐ పేర్కొంది. ఇక యూకే కి చెందిన థింక్ థ్యాంక్ సంస్థ లెక్కల ప్రకారం కరోనా రికవరీ కారణంగా గతంలో వేసిన అంచనా కంటే 2028 నాటికి చైనా.., అమెరికాను వెనక్కి నెట్టి ప్రపంచలోనే అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరిస్తున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేసింది.
