Wriddhiman Saha: క్రికెట్ కు గుడ్ బై చెప్పిన భారత క్రికెటర్

భారత క్రికెటర్ వికెట్ కీపర్  వృద్ధిమాన్  సాహా ఇంటర్నేషన్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు.  అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు.  ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ  మ్యాచ్ తనకు చివరిదని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.   సాహా తన చివరి టెస్టు  2021లో న్యూజిలాండ్‌పై ఆడాడు.  ఇటీవలే 40 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు సాహా. వయసు రీత్యా కూడా క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

వృద్ధిమాన్ సాహా భారత్ తరపున 40 టెస్టులు  ఆడి 1353 పరుగులు చేశాడు.ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. .. 9వన్డేలు ఆడి 41 రన్స్ చేశాడు. 
 సాహా 170 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిండు.   ఐపీఎల్ లో  గుజరాత్ టైటాన్స్, చెన్నై,కోల్ కతా నైట్ రైడర్స్,  పంజాబ్ కింగ్స్ ,సన్ రైజర్స్ హైదరాబాద్ లకు ప్రాతినిధ్యం వహించాడు.