దేశంలోని పులుల జనాభాను సంరక్షించాలన్న ఉద్దేశంతో మధ్యప్రదేశ్‌లోని బోపాల్‌కు 50 నుంచి 60 కి.మీ.ల దూరంలో ఉన్న రతపాని ఫారెస్ట్ మధ్యప్రదేశ్‌లో ఎనిమిదో టైగర్ రిజర్వ్‌గా, దేశంలో 57వ టైగర్ రిజర్వ్‌గా గుర్తింపు పొందింది.
రతపాని టైగర్ రిజర్వ్ 1271.4 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఇందులో 763.8 చదరపు కిలోమీటర్ల మేరకు కోర్ జోన్, 507.6 చదరపు కిలోమీటర్లు మేరకు బఫర్ జోన్ ఉన్నది. 17 ఏండ్ల క్రితమే రతపాని ఫారెస్ట్‌ను నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ(ఎన్టీసీఏ) టైగర్ రిజర్వ్‌గా గుర్తించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇటీవల అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇప్పటివరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న టైగర్ రిజర్వ్‌లు కన్హా, సత్పురా, బాంధవ్‌ఘర్, ఫెంచ్, సంజయ్ దుబ్రి, పన్నా, వీరాంగన దుర్గావతి, రతపాని టైగర్ రిజర్వు.
దేశంలో టైగర్ రిజర్వులు 57
2024, నవంబర్ వరకు భారతదేశంలో మొత్తం 56 టైగర్ రిజర్వ్‌లు ఉండేవి. 56వ టైగర్ రిజర్వ్‌గా ఛత్తీస్‌గఢ్‌లోని గురు ఘాసిదాస్ తామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్‌గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని రతపాని ఫారెస్ట్‌ను టైగర్ రిజర్వ్‌గా గుర్తించడంతో టైగర్ రిజర్వుల సంఖ్య 57కు చేరింది.
పులుల జనాభా
ప్రపంచంలో పులుల జనాభాలో 70 శాతానికిపైగా భారతదేశంలోనే ఉన్నాయి. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2022 గణాంకాల ప్రకారం దేశంలో దాదాపు 3500లకు పైగా పులులు ఉన్నాయి. 2018లో 2967, 2014లో 2256 పులులు ఉండేవి. 1973లో దేశంలోని 9 రక్షిత ప్రాంతాల్లో 18,278 చ.కి.మీ.ల విస్తీర్ణంలో టైగర్ రిజర్వ్‌లు ఉండగా, ప్రస్తుతం 78,735 చ.కి.మీ.(2.4శాతం) విస్తర్ణం మేరకు టైగర్ రిజర్వులు ఉన్నాయి.