IND vs NZ 2024: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య అక్టోబర్ 16 నుంచి మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం తొలి టెస్ట్ కు ఆతిధ్యమిస్తుంది. అక్టోబర్ 24 నుంచి పూణే వేదికగా రెండో టెస్ట్.. నవంబర్ 1 నుంచి 5 వరకు ముంబై వాంఖడేలో చివరి టెస్ట్ ఆడనున్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (2023-25) లో భాగంగా ఇరు జట్లకు ఇది కీలక సిరీస్. ఈ సిరీస్ కోల్పోతే కివీస్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ నుంచి దాదాపుగా నిష్క్రమిస్తుంది. మరోవైపు భారత్ ఈ సిరీస్ ఓడితే భారత్ ఆస్ట్రేలియాపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. 

ALSO READ | PAK vs ENG 2024: బాబర్ అజామ్ స్థానంలో కమ్రాన్ గులామ్.. ఎవరితను..? అంత పోటుగాడా..?

భారత్ తో జరగబోయే మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు న్యూజిలాండ్ క్రికెట్ తమ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌కు టామ్ లాథమ్ తొలిసారిగా పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్‌గా జట్టును నడిపించనున్నాడు. న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియంసన్ తొలి టెస్టుకు దూరం అయ్యాడు. గజ్జల్లో గాయం కారణంగా అతడు తొలి టెస్ట్ ఆడట్లేదు. బ్యాకప్ గా కేన్ స్థానంలో మార్క్ చాప్‌మన్‌ను స్క్వాడ్‌లో చేర్చారు.మరోవైపు సొంతగడ్డపై భారత్ జట్టును ప్రకటించింది. బంగ్లాదేశ్ తో ఆడిన జట్టుతోనే కివీస్ తో టెస్ట్ సిరీస్ ఆడనుంది.     
 
లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..? 

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ ను స్పోర్ట్స్ 18, కలర్స్ సినీప్లెక్స్ టీవీ ఛానెల్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. వీటితో పాటు జియో సినిమా యాప్,వెబ్‌సైట్‌లో ఈ సిరీస్ చూడొచ్చు. 

టెస్ట్ సిరీస్ షెడ్యూల్

తొలి టెస్ట్ (అక్టోబర్ 16- 20): చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు)

రెండో టెస్ట్(అక్టోబర్ 24- 28): మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్, పూణె

మూడో టెస్ట్ (నవంబర్ 01- 05): వాంఖడే స్టేడియం (ముంబై)

టెస్ట్ సిరీస్ కు న్యూజిలాండ్ జట్టు:  

టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్‌వెల్ (తొలి టెస్టుకు మాత్రమే), మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్క్, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, బెన్ సియర్స్, ఇష్ సోధి (రెండు, మూడు టెస్టులకు)టిమ్ సౌథీ, కేన్ విలియమ్సన్, విల్ యంగ్

టెస్ట్ సిరీస్ కు భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్