ఇండియా vs న్యూజిలాండ్‌ వన్డే సిరీస్: భారత మహిళల జట్టును ప్రకటించిన బీసీసీఐ

న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరగనున్న మూడు మ్యాచుల వన్డే సిరీస్ కోసం భారత మహిళల జట్టును బీసీసీఐ అనౌన్స్ చేసింది. కివీస్‎తో వన్డే పోరుకు మొత్తం 16 మంది సభ్యులతో కూడిన టీమ్‎ను ప్రకటించింది. స్టార్ బ్యాటర్ హర్మన్ ప్రీత్ కౌర్ భారత మహిళ జట్టును నడిపించనుంది. ఆల్ రౌండర్ -ఆశా శోభన గాయం కారణంగా ఈ సిరీస్‎కు దూరం కాగా.. వ్యక్తిగత కారణాలతో రిచా ఘోష్ సిరీస్ నుండి తప్పుకుంది. -సీనియర్ బౌలర్ పూజా వస్త్రాకర్‌కు బీసీసీఐ ఈ సిరీస్‌లో రెస్ట్ కల్పించింది.

 కాగా, యూఏఈ వేదికగా జరుగుతోన్న మహిళ టీ20 వరల్డ్ కప్‎కు భారత ఉమెన్స్ టీమ్ భారీ అంచనాలతో బరిలోకి దిగింది. మెగా టోర్నీ తొలి మ్యాచులోనే శ్రీలంక చేతిలో అనుహ్యంగా ఓటమి పాలై సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసుకోగా.. పాక్‎పై విజయంతో మళ్లీ ఆశలు చిగురించాయి. భారత ఆశలపై ఆస్ట్రేలియా మహిళల జట్టు నీళ్లు చల్లింది. సెమీస్ రేస్‎లో నిలువాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‎లో భారత్‎ను  ఆస్ట్రేలియా ఓడించింది. దీంతో భారత్ సెమీస్ చేరకుండానే టీ20 వరల్డ్ కప్ నుండి నిష్క్రమించింది.

ALSO READ | ఆస్ట్రేలియా X సౌతాఫ్రికా..నేడు విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి సెమీ ఫైనల్​

ఈ టోర్నీ అనంతరం సొంతగడ్డపై జరుగుతోన్న తొలి వన్డే సిరీస్ ఇదే కావడంతో ఎలాగైన సిరీస్ కైవసం చేసుకోవాలని భారత్ కసితో బరిలోకి దిగుతోంది. ఈ నెల (అక్టోబర్) 24వ తేదీ నుండి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అక్టోబ‌ర్ 27న రెండో వన్డే, అక్టోబర్ 29న మూడో వన్డే జరగనుంది. సిరీస్‎లోని మూడు మ్యాచులకు గుజరాత్ అహ్మదాబాద్‎లోని నరేంద్ర మోడీ స్టేడియం అతిథ్యం ఇవ్వనుంది. 

న్యూజిలాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టు:  హర్మన్‌ప్రీత్ కౌర్ (C), స్మృతి మంధాన (WC), షఫాలీ వర్మ, డి హేమలత, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, యాస్తికా భాటియా (WK), ఉమా చెత్రీ (WK), సయాలీ సత్గారే, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, తేజల్ హసబ్నిస్, సైమా ఠాకూర్, ప్రియా మిశ్రా, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్