IND vs NZ 2024: న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్.. భారత్ తుది జట్టు ఇదే

న్యూజిలాండ్ తో మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా భారత క్రికెట్ జట్టు రేపు (అక్టోబర్ 16) తొలి సవాలుకు సిద్ధమైంది. బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరాలంటే ఈ సిరీస్ టీమిండియాకు అత్యంత కీలకంగా మారింది. ఈ సిరీస్ గెలిస్తే దాదాపు టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్త్ ఖాయమైనట్టే. ఈ నేపథ్యంలో స్వదేశంలో జరగనున్న సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ లో భారత తుది జట్టును ఒకసారి పరిశీలిద్దాం. 

ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యువ ఆటగాడు జైశ్వాల్ ఆడతారు. నెంబర్ 3 లో గిల్ గాయం కారణంగా ఈ మ్యాచ్ లో ఆడలేకపోవచ్చు. దీంతో కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశలున్నాయి. రాహుల్, పంత్, సర్ఫరాజ్ మిడిల్ ఆర్డర్ లో వరుసగా బ్యాటింగ్ కు వస్తారు. 7, 8 స్థానాల్లో జడేజా, అశ్విన్ ఆడడం ఖాయం. ఫాస్ట్ బౌలర్లుగా బుమ్రాతో పాటు సిరాజ్ ఆడతాడు. మిగిలిన ఒకే స్పాట్ కోసం ఆకాష్ దీప్, కుల్దీప్ యాదవ్ ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. 

ALSO READ | IND vs NZ 2024: తొలి టెస్టుకు గిల్ దూరం..? సర్ఫరాజ్‌కు లైన్ క్లియర్

పిచ్ స్పిన్ కు అనుకూలించే అవకాశం ఉండడంతో ఈ మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ కు ప్లేయింగ్ 11 లో చోటు దక్కే ఛాన్స్ ఉంది. అక్షర్ పటేల్, ధృవ్ జురెల్, ఆకాష్ దీప్, శుభమాన్ గిల్ బెంచ్ కు పరిమితం కావొచ్చు. మరో వైపు న్యూజిలాండ్ ఓపెనర్లుగా కెప్టెన్ టామ్ లేతమ్, కాన్వే  దిగుతారు. విలియంసన్ ఈ మ్యాచ్ కు దూరం కావడంతో అతని స్థానంలో విల్ యంగ్ కు ఛాన్స్ రావొచ్చు. రచీన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండల్, గ్లెన్ ఫిలిప్స్  మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేస్తారు. అజాజ్ పటేల్ తో పాటు సాంట్నర్ స్పిన్ బాధ్యతలను పంచుకుంటాడు. ఫాస్ట్ బౌలర్లుగా సౌథీ, హెన్రీ తుది జట్టులో ఉంటారు. 

టీమిండియా తుది జట్టు (అంచనా)
 
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్/సర్ఫరాజ్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్/కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా

న్యూజిలాండ్ తుది జట్టు (అంచనా)

టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్,మాట్ హెన్రీ, సౌథీ, అజాజ్ పటేల్