IND vs BAN: ఉప్పల్ టీ20 టికెట్ల విక్రయాలు షురూ.. ఇలా బుక్ చేసుకోండి

అక్టోబర్ 12న ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా భారత్- బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ మధ్య టీ20 మ్యాచ్ జరగనుంది. ఆ మ్యాచ్ టికెట్ల సేల్  శనివారం ప్రారంభమైంది. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి పేటీఎం ఇన్‌‌‌‌‌‌‌‌సైడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెబ్‌‌‌‌‌‌‌‌సైడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌లో టికెట్ల విక్రయాలు మొదలయ్యాయి. ఆయా ప్లాట్ ఫామ్‌లలో అభిమానులు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. 

Q పద్ధతి.. వేచి ఉండాలి

టికెట్లు బుక్ చేసుకునేందుకు కాస్త ఎక్కువ సమయం పట్టవచ్చు. అభిమానులు ఓపికతో వేచి ఉండాలి. టికెట్ల కనీస ధర రూ. 750 కాగా,  గరిష్ట ధర రూ. 15 వేలుగా ఉంది. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో టికెట్లు కొన్న వారు ఈ నెల 8 నుంచి 12 వరకు(ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటలు)  జింఖానా స్టేడియంలో ఫిజికల్ టికెట్లు తీసుకోవచ్చు. ఈ మ్యాచ్ టికెట్లు ఆఫ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో నేరుగా అమ్మడం లేదు. గమనించగలరు.