ఇవాళ ( అక్టోబర్ 12 ) హైదరాబాద్ లో వర్షం పడే ఛాన్స్.. భారత్ - బంగ్లా మ్యాచ్ లేనట్లేనా..

ఇవాళ ( అక్టోబర్ 12, 2024 ) ఉప్పల్ స్టేడియంలో భారత్, బాంగ్లాదేశ్ మధ్య టీ20 మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. సాయంత్రం 7గంటలకు స్టార్ట్ కానున్న ఈ మ్యాచ్ కోసం భారీ ఏర్పాట్లు చేసింది హెచ్.సీ.ఏ అయితే.. ఈ మ్యాచ్ కు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా హైదరాబాద్ వ్యాప్తంగా పలుచోట్ల చిరుజల్లులు కురుస్తుండటం, ఇవాళ వాతావరణం మేఘావృతమై ఉండటంతో మ్యాచ్ పై అనుమానాలు నెలకొన్నాయి.

వర్షం కారణంగా శుక్రవారం ( అక్టోబర్ 11, 2024 ) కూడా బాంగ్లాదేశ్ టీం ప్రాక్టీస్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో బంగ్లా ప్లేయర్లు నెట్స్ కే పరిమితమయ్యారు. వర్షం కురిసే సూచనలున్న క్రమంలో పిచ్ ని, గ్రౌండ్ మొత్తాన్ని కవర్లతో కప్పేశారు స్టేడియం సిబ్బంది. మరి, శనివారం ( అక్టోబర్ 12, 2024 ) అక్కడక్కడా వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో భారత్ - బంగ్లా జరుగుతుందా లేదా అన్నది వేచి చూడాలి.

కాగా.. ఈ మ్యాచ్ కోసం కట్టుదిట్టమైన భద్రత నడుమ భారీ ఏర్పాట్లు చేసింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. స్టేడియం చుట్టూ ప్రత్యేకంగా పార్కింగ్ సదూపాయలు ఏర్పాటు చేసింది.1400ల మంది పోలీస్ లు, ఆక్టోపస్, షీ టీమ్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీస్ లతో పటిష్ట పహారా, 380 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసింది హెచ్.సీ.ఏ.