AUS vs IND: భారత్, ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే..?

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో భారత్ జట్ల మధ్య నవంబర్ 22 నుంచి 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. పెర్త్ వేదికగా ఇరు జట్ల మధ్య శుక్రవారం (నవంబర్ 22) తొలి టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచ్ కు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. రెండు పటిష్టమైన జట్లు కావడంతో ఈ టెస్ట్ మ్యాచ్ కు భారీ హైప్ నెలకొంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కు వెళ్లాలంటే ఈ సిరీస్ ఇరు జట్లకు అత్యంత కీలకం. దీంతో రెండు జట్లు కూడా సిరీస్ గెలవాలనే పట్టుదలతో ఉన్నాయి. ఉదయం 7 గంటల 50 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.   

టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరాలంటే ఆస్ట్రేలియాపై ఈ సిరీస్ ను భారత్ భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. న్యూజిలాండ్‌పై భారత్ 0-3 తేడాతో వైట్‌వాష్ అయిన తర్వాత రోహిత్ సేన టెస్టు చాంపియ‌న్‌షిప్ ఫైనల్ పోరుకు అర్హత సాధించాలంటే, ఆస్ట్రేలియా ప‌ర్యట‌న‌ చావో రేవో లాంటిది. బోర్డర్ గ‌వాస్కర్ ట్రోఫీని 5-0 లేదా 4-0 తేడాతో సిరీస్ ద‌క్కించుకుంటే, తప్ప ముందుకెళ్లే దారుల్లేవ్. అలాకాకుండా కంగారూల జట్టు ట్రోఫీని అందుకుంటే.. మనం ఆశ‌లు వదులుకోవాల్సిందే.

మరోవైపు ఈ టోర్నీలో ఆస్ట్రేలియా హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. సొంతగడ్డపై కానుండడం కంగారులకు కలిసి రానుంది. మరోవైపు టీమిండియా పేలవ ఫామ్ లో ఉంది. రోహిత్ తొలి టెస్టుకు అందుబాటులో లేకపోవడం.. కోహ్లీ పేలవ ఫామ్ లో ఉండడం.. అనుభవం లేకపోవడం.. షమీ లాంటి సీనియర్ ఫాస్ట్ బౌలర్ గాయంతో సిరీస్ కు దూరం కావడం లాంటి విషయాలు భారత్ ను కలవరపెడుతున్నాయి. 

Also Read :- ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తిలక్ జోరు.. సూర్య సహా 69 మంది వెనక్కి

ఆస్ట్రేలియా గడ్డపై చివరగా జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను భారత జట్టు గెలుచుకుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్  72 ఏళ్లలో తొలిసారి 2-1 తేడాతో ఆసీస్ గడ్డపై సిరీస్ గెలిస్తే.. 2020-21లో తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే సారధ్యంలో 2-1 తేడాతో సిరీస్ గెలుచుకుంది. చివరిసారిగా 2023 లో భారత్ వేదికగా నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 2-1 తేడాతో గెలుచుకోవడం విశేషం.

1991–92 తర్వాత ఇరుజట్ల మధ్య ఐదు టెస్ట్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌గా నిర్వహించడం ఇదే తొలిసారి. గతంలో ఎక్కువగా నాలుగు టెస్ట్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌గానే  నిర్వహించేవారు.సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ నవంబర్ 22న పెర్త్ లో జరుగుతుంది. డిసెంబర్ 6 నుంచి 10 వరకు అడిలైడ్ వేదికగా రెండో టెస్టు డే నైట్ జరుగుతుంది. డిసెంబర్ 14 నుంచి 18 వరకు గబ్బాలో మూడో టెస్ట్.. డిసెంబర్ 26 నుంచి 30 వరకు ఎప్పటిలాగే నాలుగో టెస్ట్ బాక్సింగ్ డే రోజున ప్రారంభమవుతుంది.మెల్బోర్న్ లో ఈ టెస్ట్ జరుగుతుంది. చివరిదైన ఐదో టెస్ట్ జనవరి 3 నుంచి 7 వరకు సిడ్నీ వేదికగా జరుగుతుంది.

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లైవ్ స్ట్రీమింగ్

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ టీవీల్లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. మొబైల్స్ లో డిస్నీ+ హాట్‌స్టార్ యాప్ లో ఈ మ్యాచ్ లైవ్ చూడొచ్చు. వెబ్‌సైట్‌లోనూ ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.


భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా , యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, విరాట్ కోహ్లీ, ప్రసిద్ధ్ కృష్ణ, రవిచంద్రన్ అశ్విన్ , మహ్మద్ షమీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ , హర్షిత్ రాణా, అభిమన్యు ఈశ్వరన్, శుభమన్ గిల్, నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ సిరాజ్ , వాషింగ్టన్ సుందర్ .

ఆస్ట్రేలియా జట్టు:

పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషాగ్నే, నాథన్ లియోన్, మిచ్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనీ, స్టీవ్ స్మిత్ , మిచెల్ స్టార్ .