టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లి
అడిలైడ్: తొలి టెస్ట్ లో భారత్ ఎదురీదుతున్నట్లే కనిపిస్తోంది. డే అండ్ నైట్ టెస్ట్ లో భాగంగా తొలి రోజు మొదటి సెషన్ లో భారత్ 2 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. 32 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ స్కోర్ 60/2గా ఉంది. చటేశ్వర్ పుజారా 26 పరుగులతో.. కెప్టెన్ విరాట్ కోహ్లి 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరును మెల్లగా పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు రెండు బంతులకే పృథ్వీషా వికెట్ పోగొట్టుకుని చిక్కుల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఛటేశ్వర్ పుజారా మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తో కలసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దేపనిలోపడ్డారు. ఆస్ట్రేలియా బౌలర్ల సహనాన్ని పరీక్షించే విధంగా మెల్లగా ఆడుతూ స్కోరు పెంచే పనిలోపడ్డారు.

నిలకడగా ఆడుతున్నారని అనుకుంటున్న సమయంలోనే 32 పరుగుల వద్ద మయాంక్ ఔటయ్యాడు. సుమారు 90 నిమిషాలపాటు క్రీజులో ఉన్న మయాంక్ 40 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతో 17 పరుగుల వద్ద కమిన్స్ బౌలింగ్ లో ఔటయ్యాడు. తర్వాత బరిలోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి.. మ్యాచ్ లో ఆస్ట్రేలియా బౌలర్ల ఆధిపత్యాన్ని తగ్గించే విధంగా నిలకడగా ఆడుతున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్‌లో ఓడి.. టీ20ల్లో గెలిచిన ఇండియా టీమ్ అసలు పోరాటం చేస్తోంది. టూర్ మొదలైనప్పట్నించి హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్న ‘డే/నైట్’ టెస్ట్ లో ఇండియా టాస్ గెలవడంతో.. మ్యాచ్ గెలిచినట్లే అన్నట్లు సంబరపడిపోయారు. బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్‌లో జరుగుతున్న పింక్ టెస్ట్‌లో పటిష్టమైన ఆసీస్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోంది.
చాలా రోజుల తర్వాత జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్ ద్వారా డే/నైట్ టెస్ట్‌లకు మరింత ప్రాచుర్యం కలుగుతుందని నిర్వాహకులు భావిస్తుంటే.. క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం కోహ్లీ వర్సెస్ స్మిత్ రైవలరీని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. రెండేళ్ల కిందట సిరీస్ గెలిచిన టీమిండియా.. దానిని నిలబెట్టుకోవాలని పక్కా ప్లాన్స్ తో బరిలోకి దిగడంతో పింక్ టెస్ట్‌పై చాలా హైప్ క్రియేట్ అయ్యింది.
