India vs Australia : ఇండియా ఢమాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. నాలుగో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేన భారీ ఓటమి

 

  • 184 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా
  • ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2–1 ఆధిక్యం
  • జైస్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒంటరి పోరాటం వృథా

మెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బోర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా మరోసారి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫెయిలైంది. టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యశస్వి జైస్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (208 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 8 ఫోర్లతో 80), రిషబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (104 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2 ఫోర్లతో 30) పోరాడినా.. మిగతా స్టార్లందరూ పెవిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్యూ కట్టడంతో సోమవారం ముగిసిన ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీమిండియా 184 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారీ తేడాతో కంగారూల చేతిలో పరాజయం పాలైంది. ఫలితంగా ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల బోర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–గావస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రోఫీలో ఇండియా 2–1తో వెనకబడింది. 228/9 ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కోరుతో ఐదో రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 83.4 ఓవర్లలో 234 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేథన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైయన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (41)ని బుమ్రా (5/57) ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడంతో 10 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తెరపడింది. దీంతో కంగారూలు నిర్దేశించిన 340 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇండియా రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 79.1 ఓవర్లలో 155 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే కుప్పకూలింది. కమిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (3/28), బోలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (3/39) చేసిన దాడికి ఇండియా ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కకావికలమైంది. మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొత్తంలో 6 వికెట్లు తీసిన కమిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆఖరిదైన ఐదో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనవరి 3 నుంచి సిడ్నీలో జరుగుతుంది.

కోహ్లీ, రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సహా..

టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఛేదనలో టీమిండియా స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (9), కోహ్లీ (5)తో సహా అందరూ నిరాశపర్చారు. ఓ ఎండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జైస్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒంటరి పోరాటం చేసినా.. రెండో ఎండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అతనికి సహకారం అందించేవారు కరువయ్యారు. దీనికి తోడు కమిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బోలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్వింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బౌన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో చెలరేగితే  లైయన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (2/37), స్టార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (1/25) వేరియబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకున్నారు. 17వ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐదు బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేడాలో కమిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (0)ను ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి మొదలుపెట్టిన వికెట్ల పతనం ఎక్కడా ఆగలేదు. హిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అల్ట్రా డిఫెన్సివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్నిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బోల్తా పడగా, రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓ గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెంగ్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెలివరీకి వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన కోహ్లీ క్రీజులో అనుకూలంగా కదల్లేదు. జైస్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెడ్లీ డిఫెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాపాడుకున్నా.. 27వ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్టార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేసిన క్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాంగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరోసారి కవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడబోయి ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఖవాజా చేతికి చిక్కాడు. 33/3తో కష్టాల్లో పడిన ఇండియాను పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జైస్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 88 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోడించి డ్రాపై ఆశలు కల్పించారు. కానీ అప్పటి వరకు నెమ్మదిగా ఆడిన పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (1/14) బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారీ షాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొట్టి లాంగాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మార్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. ఇక ఇక్కడి నుంచి ఇండియా లైనప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేకమేడలా కూలింది. 121/3తో ఉన్న ఇండియా 20.4 ఓవర్లలో 34 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోడించి చివరి ఏడు వికెట్లు చేజార్చుకుంది. జడేజా (2), నితీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (1), ఆకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (7), బుమ్రా (0), సిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (0), సుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (5 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) సింగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే పరిమితమయ్యారు. 

 గెలిస్తేనే ఆశలు!

నాలుగో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓటమితో ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆశలు మరింత సంక్లిష్టం అయ్యాయి. ఇప్పటికే సౌతాఫ్రికా టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కైవసం చేసుకోగా, ప్రస్తుతం ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (61.46), ఇండియా (52.78) వరుసగా రెండు, మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. ఒకవేళ ఇండియా ఫైనల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధించాలంటే ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరిగే ఐదో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కచ్చితంగా గెలవాలి. అదే టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. శ్రీలంకతో ఆడే తర్వాతి రెండు టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో ఒకదాంట్లో ఓడాలి. లేదంటే ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లంక సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 0–0తో డ్రా అయితే ఇండియా ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటుంది.

జైస్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఔటా.. నాటౌటా?

70.5వ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కమిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేసిన లెఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జైస్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడేందుకు  ప్రయత్నించాడు. కానీ బాల్​ బ్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తాకకుండా నేరుగా కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేతుల్లోకి వెళ్లింది. ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్పీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసినా ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంపైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఔటివ్వలేదు. వెంటనే కమిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకున్నాడు. బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. బ్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తాకినట్లు శబ్దం రాలేదు. స్నికో మీటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎలాంటి స్పైక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకపోయినా థర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంపైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఔటిచ్చాడు. స్పైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాకపోయినా బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గమనం మారడంతో ఔటిచ్చినట్లు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత ప్రకటించారు. దీనిపై జైస్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశాడు. 

జైస్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఔటా.. నాటౌటా?

70.5వ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కమిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేసిన లెఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జైస్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడేందుకు  ప్రయత్నించాడు. కానీ బాల్​ బ్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తాకకుండా నేరుగా కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేతుల్లోకి వెళ్లింది. ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్పీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసినా ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంపైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఔటివ్వలేదు. వెంటనే కమిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకున్నాడు. బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. బ్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తాకినట్లు శబ్దం రాలేదు. స్నికో మీటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎలాంటి స్పైక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకపోయినా థర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంపైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఔటిచ్చాడు. స్పైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాకపోయినా బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గమనం మారడంతో ఔటిచ్చినట్లు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత ప్రకటించారు. దీనిపై జైస్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశాడు. 

సంక్షిప్త స్కోర్లు

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: 474 ఆలౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: 369 ఆలౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: 83.4 ఓవర్లలో 234 ఆలౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (లైయన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 41, బుమ్రా 5/57), ఇండియా రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: 79.1 ఓవర్లలో 155 ఆలౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (జైస్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 84, పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 30, కమిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3/28).