ఇండియా క్లీన్‌‌‌‌స్వీప్‌‌‌‌

చెన్నై : ఆఫ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ అన్మోల్‌‌‌‌జీత్‌‌‌‌ సింగ్‌‌‌‌ (9/104), మహ్మద్‌‌‌‌ ఇనామ్‌‌‌‌ (7/97) చెలరేగడంతో.. ఆస్ట్రేలియా అండర్‌‌‌‌-19తో జరిగిన అనధికార రెండో టెస్ట్‌‌‌‌లో ఇండియా అండర్‌‌‌‌-19 జట్టు ఇన్నింగ్స్‌‌‌‌ 120 రన్స్‌‌‌‌ తేడాతో గెలిచింది. దీంతో రెండు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌ను 2-0తో క్లీన్‌‌‌‌స్వీప్‌‌‌‌ చేసింది. 142/3 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో బుధవారం మూడో రోజు ఆట కొనసాగించిన ఆసీస్‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 80.2 ఓవర్లలో 277 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. ఒలివర్‌‌‌‌ పీక్‌‌‌‌ (117), అలెక్స్‌‌‌‌ యంగ్‌‌‌‌ (66) నాలుగో వికెట్‌‌‌‌కు 166 రన్స్‌‌‌‌ జోడించారు.

 యంగ్‌‌‌‌ ఔటైన తర్వాత ఆసీస్‌‌‌‌ 59 రన్స్‌‌‌‌ తేడాతో చివరి ఆరు వికెట్లు కోల్పోయింది. ఇనామ్‌‌‌‌, అన్మోల్‌‌‌‌జీత్‌‌‌‌ చెరో నాలుగు వికెట్లు తీశారు. తర్వాత ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌‌‌‌లోనూ 31.3 ఓవర్లలో 95 రన్స్‌‌‌‌కే కుప్పకూలింది. స్టీవెన్‌‌‌‌ హోగన్‌‌‌‌ (29), సిమోన్‌‌‌‌ బడ్జ్‌‌‌‌ (26) మినహా మిగతా వారు నిరాశపర్చారు. అన్మోల్‌‌‌‌జీత్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది.