IND vs NZ 3rd Test: తొలి రోజు ఇద్దరిది: ఒకే రోజు 14 వికెట్లు.. రసవత్తరంగా ముంబై టెస్ట్

ముంబై వాంఖడే స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఆసక్తికరంగా మారింది. ఒక్క రోజే 14 వికెట్లు పడడంతో మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 235 పరుగులకే ఆలౌట్ కాగా.. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ తడబడుతుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. క్రీజ్ లో పంత్ (1), గిల్ (31) ఉన్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో ఇంకా 149 పరుగులు వెనకబడి ఉంది. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ 2 వికెట్లు తీసుకున్నాడు. హెన్రీకి ఒక వికెట్ లభించింది. 
 
కివీస్ ను తక్కువ స్కోర్ కే పరిమితం చేశామని ఆనందం భారత్ కు కాసేపైనా మిగల లేదు. హెన్రీ బౌలింగ్ లో రోహిత్ శర్మ షాట్  అంచనా వేయడంలో విఫలమయ్యాడు. 18 పరుగులు చేసి స్లిప్ లో దొరికిపోయాడు. ఆ తర్వాత గిల్, జైశ్వాల్ భారత్ ఇన్నింగ్స్ ను జాగ్రత్తగా ముందుకు నడిపించారు. రెండో వికెట్ కు 53 పరుగులు జోడించిన తర్వాత ఒక రివర్స్ స్వీప్ కు ప్రయత్నించి జైశ్వాల్ అజాజ్ పటేల్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. ఈ దశలో నైట్ వాచ్ మెన్ గా వచ్చిన సిరాజ్ తొలి బంతికే ఔటయ్యాడు. 

ALSO READ | IND vs NZ 3rd Test: 5 వికెట్లతో జడేజా మాయాజాలం.. 235 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్

మరో మూడు ఓవర్లలో ఆట ముగుస్తుందనుకున్న సమయంలో భారత్ ను ఊహించని షాక్ తగిలింది. సింగిల్ కోసం ప్రయత్నించి కోహ్లీ రనౌటయ్యాడు. వికెట్ నష్టానికి 78 పరుగులతో పటిష్టంగా కనిపించిన భారత్ ఆట ముగిసి సమయానికి 4 వికెట్లకు 86 పరుగులతో రోజు ముగించింది. ఆట చివర్లో భారత్ 3వికెట్లు కోల్పోవడంతో తొలి రోజును భారత్, న్యూజిలాండ్ సంతృప్తిగా ముగించాయి. అంత ముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 235 పరుగులకు ఆలౌటైంది. 82 పరుగులు చేసిన మిచెల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. యంగ్ హాఫ్ (71) సెంచరీ చేసి రాణించాడు. భారత బౌలర్లలో జడేజా 5 వికెట్లు పడగొట్టాడు. సుందర్ నాలుగు వికెట్లు తీసుకోగా.. ఆకాష్ దీప్ కు ఒక వికెట్ దక్కింది.