IND Vs NZ, 1st Test: మలుపు తిప్పారు: రెండో ఇన్నింగ్స్‌లో భారత్ దూకుడు.. రసవత్తరంగా బెంగళూరు టెస్ట్

బెంగళూరు టెస్ట్ లో టీమిండియా గాడిలో పడింది. చేజారుతుందనుకున్న టెస్టు కాపాడుతున్నారు. తొలి ఇన్నింగ్స్ లో ఘోరంగా విఫలమైనా.. రెండో ఇన్నింగ్స్ లో అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంటున్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో  ఇన్నింగ్స్ లో 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. క్రీజ్ లో క్రీజ్ లో సర్ఫరాజ్ (70) ఉన్నాడు. ఆట ముగుస్తుందనుకున్న సమయంలో కోహ్లీ ఔట్ కావడం కివీస్ కు అనుకూలంగా మారింది.   

భారత్ ఇంకా 125 పరుగులు వెనకపడి ఉంది. రోహిత్ శర్మ (52) అర్ధ సెంచరీతో రాణించాడు. జైశ్వాల్ 35 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఆట చివరి రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో నాలుగో రోజు ఆట అత్యంత కీలకం కానుంది. చేతిలో మరో 7 వికెట్లు ఉండడంతో ఈ మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుంది. 

ALSO READ | IND Vs NZ, 1st Test: అరుదైన ఘనత.. టెస్టుల్లో 9 వేల పరుగుల క్లబ్‌లో విరాట్ కోహ్లీ

356 పరుగులు వెనకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ కు ఓపెనర్లు జైశ్వాల్, రోహిత్ శర్మ తొలి వికెట్ కు 72 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ ఔటైనా కోహ్లీ, సర్ఫరాజ్ భారీ భాగస్వామ్యంతో మ్యాచ్ ను నిలబెట్టారు. మూడో వికెట్ కు 136 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి పటిష్ట స్థితికి చేర్చారు. అజాజ్ పటేల్ రెండు వికెట్లు తీసుకోగా.. ఫిలిప్స్ కు ఒక వికెట్ దక్కింది.   

3 వికెట్ల నష్టానికి 180 పరుగులతో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 402 పరుగులకు ఆలౌటైంది. రచీన్ రవీంద్ర 134 పరుగులు చేసి మూడో రోజు ఒక్కడే వారియర్ లా పోరాడాడు. సౌథీ 65 పరుగులు చేసి అతనికి సహకరాం అందించాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, జడేజా తలో మూడు వికెట్లు తీసుకున్నారు. సిరాజ్ కు 2 వికెట్లు దక్కాయి. బుమ్రా, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు.