Team India: బోర్డర్–గవాస్కర్ టోర్నీ ముగిసింది.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదే

ఆరు నెలలుగా టెస్టులతో బిజీగా మారిన టీమిండియా తర్వాత మూడు నెలల పాటు పరిమిత ఓవర్ల క్రికెట్ పై దృష్టి పెట్టనుంది. ఇటీవలే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 1-3 తేడాతో ఓడిపోయిన టీమిండియా.. ఆ తర్వాత ఇంగ్లాండ్ తో అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టీ20లు, మూడు వన్డేలు జరగనున్నాయి.ఈ సిరీస్ జనవరి 22 నుంచి ప్రారంభం కానుంది. ఒకరకంగా ఈ ద్వైపాక్షిక సిరీస్ ఇరు జట్లకు ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు సన్నాహక మ్యాచ్‌లుగా ఉపయోగపడనుంది.   

భారత పర్యటన కోసం ఇప్పటికే ఇంగ్లండ్ & వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) తమ జట్టును ప్రకటించింది. జోస్ బట్లర్ నాయకత్వంలో 15 మంది సభ్యులు గల బలమైన జట్టును ఎంపిక చేసింది. టెస్ట్ కెప్టెన్ బెన్‌ స్టోక్స్‌కు ఈ జట్టులో చోటు దక్కకపోగా.. ఇటీవల జరిగిన సిరీస్‌లలో సెంచరీల మీద సెంచరీలు బాధేస్తున్న వెటరన్ క్రికెటర్ జో రూట్ తిరిగొచ్చాడు. భారత జట్టును త్వరలో ప్రకటించాల్సి ఉంది. టీ20 సిరీస్ కు సూర్య కుమార్ యాదవ్.. వన్డేలకు రోహిత్ శర్మ కెప్టెన్ లు గా కొనసాగనున్నారు. ఈ సిరీస్ అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది.  

ఇంగ్లండ్ జట్టు: 

జోస్ బట్లర్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, మార్క్ వుడ్.

భారత్ vs ఇంగ్లండ్ వైట్-బాల్ సిరీస్ షెడ్యూల్

మొదటి టీ20: జనవరి 22 (ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా)

రెండో టీ20: జనవరి 25  (చిదంబరం స్టేడియం, చెన్నై)

మూడో టీ20: జనవరి 28 (నిరంజన్ షా స్టేడియం, రాజ్‌కోట్)

నాలుగో టీ20: జనవరి 31 (MCA స్టేడియం, పూణె)

ఐదో టీ20:  ఫిబ్రవరి 2 (వాంఖడే స్టేడియం, ముంబై)

మొదటి వన్డే:  ఫిబ్రవరి 6 (VCA స్టేడియం, నాగ్‌పూర్)

రెండో వన్డే:  ఫిబ్రవరి 9 ఆదివారం (బారాబతి స్టేడియం, కటక్)

మూడో వన్డే: ఫిబ్రవరి 12 (నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్)