క్వార్టర్ 3 2022లో భారతదేశం అతిపెద్ద స్మార్ట్‌వాచ్ మార్కెట్‌గా అవతరించింది. బేసిక్ స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్లో గ్లోబల్ ర్యాంక్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. కౌంటర్ పాయింట్ ఇచ్చిన నివేదిక ప్రకారం 2022 3వ త్రైమాసికంలో భారత స్మార్ట్‌వాచ్ మార్కెట్ షిప్మెంట్ ప్రపంచ వ్యాప్తంగా 30 శాతం పెరిగింది. ఇందులో ఇండియన్ బ్రాండ్స్ ఫైర్ బోల్డ్, నాయిస్, బోట్ కంపెనీలే ఎక్కువ మార్కెట్ షేర్ని ఆక్రమించాయి.
దీనికి కారణం వినియోగదారుల అవసరాలకు తగ్గట్టు కంపెనీలు స్మార్ట్‌వాచ్‌లను తయారుచేయడమే అంటున్నారు మార్కెట్ అనలిస్ట్‌లు. ఇవి సాధారణ వినియోగదారునికి అందుబాటు ధరలో, కావాల్సిన అన్ని ఫీచర్లని అందిస్తున్నాయి. ఈ వరుసన గ్లోబల్ టాప్ సెల్లింగ్ ఇండియన్ స్మార్ట్‌వాచ్ బ్రాండ్ల లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లో నాయిస్ కంపెనీ ఉంది. ఇది 25.2 శాతం మార్కెట్ షేర్ని ఆక్రమించింది. తర్వాత ప్లేస్‌లో ఫైర్ బోల్ట్ 24.6 శాతం, బోట్ 16.8 శాతం మార్కెట్ షేర్ని ఆక్రమించాయి.
