ఆడతోడు కోసం 3వేల కిలోమీటర్లు తిరిగిన మగపులి

ఆడతోడు కోసం 3వేల కిలోమీటర్లు తిరిగిన మగపులి

ఓ మగ పులి..,ఆడపులి తోడు కోసం సుమారు 3వేల కిలోమీటర్లు ప్రయాణించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.  2016 మహరాష్ట్ర తిపేశ్వర్ పులుల అభయారణ్యంలో మూడు పులులు జన్మించాయి. వీటికి అధికారులు సీ1, సీ2, సీ3 అని పేర్లు పెట్టారు. వీటికి ఇప్పుడు మూడేళ్లు.ఆడ తోడును వెతుక్కుంటూ మగ పులులైన సీ1, సీ3 బయలుదేరాయి. అలా మహరాష్ట్ర నుంచి వీటి కదలికలు ప్రారంభం కావడంతో అటవీశాఖ అధికారులు రేడియో కాలర్లు అమర్చారు. గత జూన్ లో తిపేశ్వర్ ను దాటిన ఇవి, పంధార్ కవాడా డివిజన్ మీదుగా  తెలంగాణకు చేరాయి. సీ3 అనే పెద్దపులి, ఆదిలాబాద్ పట్టణం శివార్ల వరకూ వచ్చింది. సీ1 అనే పులి అంబాడీ ఘాట్, కిన్వాత్ అడవుల ద్వారా ఆదిలాబాద్ డివిజన్ కు వచ్చింది.  ఈ సంవత్సరం ఆగస్టు నుంచి సెప్టెంబర్ మధ్య అంతర్రాష్ట్ర అడవుల్లో ఉన్న ఇవి చివరికి  ధ్యానగంగ అభయారణ్యానికి చేరుకున్నట్లు అటవీశాఖ అధికారులు చెప్పారు.