అణ్వస్త్ర క్షిపణి ‘అగ్ని-4’ పరీక్ష సక్సెస్

అణ్వస్త్ర క్షిపణి ‘అగ్ని-4’ పరీక్ష సక్సెస్

4000 కిలోమీటర్ల  దూరంలోని లక్ష్యాలను ఛేదించగల.. అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. సోమవారం రాత్రి 7.30 గంటలకు ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ లో ఈ క్షిపణి పరీక్షను నిర్వహించారు. వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థను సమకూర్చుకునే క్రమంలో అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన ఈ క్షిపణిని భారత్  పరీక్షించింది. అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం దీని సొంతం. ఈక్రమంలోనే 1000 నుంచి 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ‘అగ్ని ప్రైమ్’ క్షిపణిని గతేడాది భారత్ విజయవంతంగా పరీక్షించింది. 

మరిన్ని వార్తలు..

ఏసీబీకి చిక్కిన ఘట్కేసర్ సబ్ రిజిస్ట్రార్

ఆసుపత్రిలో చేరిన నవజ్యోత్‌ సిద్ధూ