నౌకాదళాన్ని శత్రు దుర్భేధ్యంగా మార్చేందుకు దోహదపడే ‘వీఎల్- ఎస్ఆర్ఎస్ఏఎం’ స్వల్ప శ్రేణి క్షిపణిని భారత్ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్ తీరంలో ఓ నౌక నుంచి ఈ ప్రయోగ పరీక్షను నిర్వహించారు. నిట్ట నిలువు (వర్టికల్) గా క్షిపణిని ప్రయోగించగా.. లక్ష్యాన్ని ఛేదించడంలో సఫలమైంది. గగనతలం నుంచి యుద్ధ నౌకలకు ముప్పు లేకుండా కాపాడేందుకు ఈ క్షిపణి ఉపయోగపడుతుంది. ఈ ప్రయోగ పరీక్షను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) శాస్త్రవేత్తలు పర్యవేక్షించారు. పరీక్ష విజయవంతం అయిన సందర్భంగా శాస్త్రవేత్తలను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, డీఆర్డీవో చైర్మన్ జి.సతీశ్ రెడ్డి అభినందించారు. హైస్పీడ్ గగనతల లక్ష్యాన్ని ఈ క్షిపణి విజయవంతంగా ఛేదించిందని పేర్కొన్నారు.
India successfully test-fires VL-SRSAM missile from Indian Naval Ship off Odisha coast
— ANI Digital (@ani_digital) June 24, 2022
Read @ANI Story | https://t.co/q1BpeOwzlz#India #IndianNavalShip #Odisha pic.twitter.com/Da4OlfauCs
