ఇదేం అమాయకులపై దాడిని కచ్చితంగా ఖండిస్తం: భారత విదేశాంగ శాఖ

న్యూఢిల్లీ: ఇటీవల అఫ్గానిస్తాన్‌‌పై పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. తమ అంతర్గత వైఫల్యాలకు పొరుగు దేశాలను నిందించడం పాకిస్తాన్​కు అలవాటుగా మారిందని మండిపడింది. 

సోమవారం మన దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడారు. "గతేడాది డిసెంబర్ 24న అఫ్గానిస్తాన్‌‌లోని పక్తికా ప్రావిన్స్‌‌పై పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో మహిళలు, పిల్లలు సహా 51 మంది మరణించినట్లు మీడియా ద్వారా మా దృష్టికి వచ్చింది. 

అమాయక పౌరులపై దాడి జరిగితే భారత్ నిస్సందేహంగా ఖండిస్తుంది. అంతర్గత వైఫల్యాలకు పొరుగు దేశాలను నిందించడం పాకిస్తాన్​కు అలవాటుగా మారింది. దీనిపై అఫ్గాన్ అధికార ప్రతినిధి స్పందన కూడా మా దృష్టికి వచ్చింది" అని పేర్కొన్నారు.