ఆఫ్ఘాన్లు ఇకపై భారత్‌కు రావాలంటే ఇ-వీసా తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం మధ్యాహ్నం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితులను లెక్కలోకి తీసుకుని.. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. ఆఫ్ఘనిస్తానీయుల కోసం భారత్ 'ఇ- ఎమర్జెన్సీ ఎక్స్-మిస్ వీసా' అనే కొత్త కేటగిరి వీసాను ప్రవేశపెట్టిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వీసాకు ఆరు నెలల వ్యవధి ఉంటుంది. ప్రస్తుతం అక్కడ నెలకొన్న భద్రతా కారణాల దృష్ట్యా... ఈ కొత్త వీసా కేటగిరి ప్రారంభించినట్లు... ఈ ఇ-వీసా ద్వారానే భారత్‌లోకి అనుమతిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. పలువురు ఆ దేశస్తులు వీసాలు పొగొట్టుకున్నారని వస్తున్న నివేదికల క్రమంలో.. గతంలో జారీ చేసిన వీసాలు (ప్రస్తుతం భారత్‌లోని ఆఫ్ఘాన్లు) చెల్లవని హోం మంత్రిత్వ శాఖ చెప్పింది. ఆఫ్ఘాన్‌లో భారత రాయబార కార్యాలయం మూసివేసినందున, దరఖాస్తులు న్యూఢిల్లీలో పరిశీలించబడతాయని.. ప్రాసెస్ చేయబడతాయని అధికారులు తెలిపారు.
