వచ్చే నెల (నవంబర్)లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 కోసం బీసీసీఐ శుక్రవారం (అక్టోబర్ 25) భారత జట్టును ప్రకటించింది. మొత్తం 18 మంది ప్లేయర్లతో టీమిండియా స్కాడ్‌ను బీసీసీఐ అనౌన్స్ చేసింది. ఆసీస్‌తో జరగనున్న ఈ హై వోల్టేజ్ సిరీస్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. స్టార్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం స్వదేశంలో న్యూజిలాండ్ తో జరగుతోన్న మూడు మ్యాచుల సిరీస్‌లో పరుగుల వరద పారిస్తోన్న యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో చోటు దక్కించుకున్నాడు.
ఇదిలా ఉండగా.. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఎస్ఆర్హెచ్ ఆల్ రౌండర్, తెలుగు ప్లేయర్ నితీష్ రెడ్డి లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. ఇటీవల బంగ్లాదేశ్‌పై సెంచరీతో చెలరేగిన నితీష్ ఏకంగా భారత్‌కు ఎంతో కీలకమైన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సెలెక్ట్ అయ్యాడు. భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి ఇటీవలే ఎంట్రీ ఇచ్చిన నితీష్.. అనతి కాలంలోనే టెస్ట్ క్రికెట్లోకి అరంగ్రేటం చేయబోతున్నాడు.
నితీష్ రెడ్డితో పాటు మరో యంగ్ ప్లేయర్ అభిమన్యు ఈశ్వరన్ కూడా టెస్ట్ క్రికెట్ అరంగ్రేటం చేయబోతున్నాడు. ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్ రిజర్వ్ ప్లేయర్లుగా బీసీసీఐ ఎంపిక చేసింది. వన్డే వరల్డ్ కప్ అనంతరం గాయంతో గ్రౌండ్‌కు దూరమైన సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో పునరాగమనం చేస్తాడని గత కొన్ని రోజులుగా క్రీడా వర్గాల్లో ప్రచారం జరిగింది. కానీ బీసీసీఐ షమీని ఈ ప్రతిష్టాత్మక సిరీస్ కు ఎంపిక చెయ్యకుండా పక్కకు పెట్టింది.
ALSO READ | Emerging Asia Cup 2024: తేలిపోయిన ఐపీఎల్ బౌలర్.. ఒక ఓవర్‌లో 31 పరుగులు
బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ షెడ్యూల్:
బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నవంబర్ 22 నుంచి భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది.
- మొదటి టెస్ట్ (నవంబర్ 22 - 26): పెర్త్
- రెండో టెస్ట్ (డిసెంబర్ 06 - 10): అడిలైడ్
- మూడో టెస్ట్ (డిసెంబర్ 14 - 18): బ్రిస్బేన్
- నాలుగో టెస్ట్ (డిసెంబర్ 26 - 31): మెల్బోర్న్
- ఐదో టెస్ట్ (జనవరి 03 - 08): సిడ్నీ
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి భారత జట్టు:
రోహిత్ శర్మ (సి), జస్ప్రీత్ బుమ్రా (విసి), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్ , విరాట్ కోహ్లీ , కెఎల్ రాహుల్ , రిషబ్ పంత్ (డబ్ల్యుకె), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (డబ్ల్యుకె), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, మొహమ్మద్. సిరాజ్, ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.
రిజర్వ్‌లు: ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్
? NEWS ?
— BCCI (@BCCI) October 25, 2024
Squads for India’s tour of South Africa & Border-Gavaskar Trophy announced ?#TeamIndia | #SAvIND | #AUSvIND pic.twitter.com/Z4eTXlH3u0