దేశంలో 24 గంటల్లో 893 మంది మృతి

దేశంలో 24 గంటల్లో 893 మంది మృతి

భారత్ లో కరోనా కేసులు కొన్ని రోజులుగా తగ్గుతున్నాయి. కానీ మరణాల సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,34,281  పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన పడి ఒక్కరోజే 893 మంది మరణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి 3,52,784 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా18,84,937 పాజిటివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 14.50శాతంగా ఉంది. ఇక ఇప్పటివరకు భారత్ లో 1,65,70,87,692 మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యింది.