భారత్ లో రోజూ వారీగా తగ్గుతున్న కేసులు

భారత్ లో రోజూ వారీగా తగ్గుతున్న కేసులు
దేశంలో కరోనా రోజు రోజుకి తగ్గు ముఖం పడుతోంది. ఆరు నెలల్లో తొలిసారి అతి తక్కువ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 16,432 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య1,02,24,303 కు చేరింది.  నిన్న 252 మంది చనిపోవడంతో మొత్తం మరణాలు 1,48,153కు చేరాయి. ప్రస్తుతం దేశంలో 2,68,581 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న24,900 కోలుకోవడంతో మొత్తం కరోనా నుంచి 98,07,569 రికవరీ అయ్యారు. సోమవారం ఒక్కరోజే 9,83,695 టెస్టులు చేయగా.. డిసెంబర్ 28 వరకు 16 కోట్ల 98 లక్షల ఒక వెయ్యి 749  టెస్టులు చేశారు. India reports 16,432 new COVID-19 cases, 24,900 recoveries, and 252 deaths in last 24 hours, as per Union Health Ministry Total cases: 1,02,24,303 Active cases: 2,68,581 Total recoveries: 98,07,569 Death toll: 1,48,153 pic.twitter.com/gPTZWjXkWm — ANI (@ANI) December 29, 2020