భారత్ లో భారీగా పెరుగుతోన్న కరోనా మరణాలు

భారత్ లో భారీగా పెరుగుతోన్న కరోనా మరణాలు

దేశం కరోనా ఉదృతి కొనసాగుతోంది. రోజురోజుకు కేసులు తగ్గుతున్నా మరణాలు పెరగడం కలవర పెడుతోంది. గడిచిన 24 గంటల్లో 1,72,433 కేసులు నమోదవ్వగా 1008 మంది చనిపోయారు.2,59,107 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా దేశంలో 15,33,921 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. రోజు వారి పాజిటివిటి రేటు 10.99 శాతంగా ఉంది. భారత్ లో  నిన్నటి వరకు 167.87 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ జరిగింది.