నోరూరించే వంటకాలు సోషల్ మీడియాలో పోస్ట్ అవుతుంటాయి. వీటిని చూసి ఇంట్లో ప్రయోగాలు చేస్తుంటారు. ఇప్పుడు కొత్తగా రాస్ మలై స్వీట్వైరల్ అవుతుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా టేస్ట్ అట్లాస్, గ్యాస్ట్రోనమిక్ 2వ చీజ్ డెజర్ట్ గా ర్యాంక్ ఇచ్చారు. దీనిని హిందీలో జూసీ క్రీమ్ అని పిలుస్తారు. ఈ రుచికరమైన స్వీట్ ను బెంగాల్ ప్రజలు ఎక్కువుగా ఇష్టపడతారు. దేశవ్యాప్తంగా స్వీట్ డెజర్ట్ గా మారింది. రాస్ మలైను క్రీము, ఏలుకలు, మిల్క్ సిరప్‌తో తయారు చేస్తారు. దీనిని ఏఏ పదార్ధాలతో ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం.
కావలసినవి
- 1 లీటరు పూర్తి కొవ్వు పాలు
- 1 కప్పు చక్కెర
- 1/2 టీస్పూన్ యాలకుల పొడి
- 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం
- ఒక చిటికెడు కుంకుమపువ్వు తంతువులు
- తరిగిన గింజలు (బాదం, పిస్తాపప్పులు)
రాస్ మలై బాల్స్ తయారీ విధానం
ముందుగా పాలను సన్నని సెగపై మరిగించాలి. ఆ తరువాత గంటెతో పాలను తిప్పుతూ చల్లార్చాలి. పాలను కదిలిస్తుండగానే నిమ్మరసం కలపాలి. దీంతో పాలు విరుగుతాయి. పాల విరుగుడు పదార్దాలను ( ఘనంగా ఉన్న దానిని వేరు చేయలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. పులుపు రుచిని తొలగించేందుకు ఈ పదార్దాన్ని చల్లని నీటితో శుభ్రం చేయాలి. తరువాత ఘనపదార్దాన్ని మెత్తగా పిండిమాదిరిగా తయారు చేసి చిన్న చిన్న ఉండలు మాదిరిగా తయారు చేసుకోండి.
మిల్క్ సిరప్ తయారీ విధానం
వెడల్పాటి కళాయి తీసుకొని చక్కెర పూర్తిగా కరిగేపోయేంత వరకు నీటిని కలిపి మరిగించండి. ఒక విధంగా పల్చగా పంచదార పాకం అనుకోవచ్చు. ఆతరువాత అందులో ఏలకుల పొడి... కుంకుమపువ్వు కలిపి ఉడికిస్తూ వాటిలో ఇప్పటికే తయారు చేసిన ఉండలను రంగు మారేంతవరకు సన్నని సెగపై ఉడికించండి. దాదాపుగా 15 నుంచి 20 నిమిషాలు ఉడికించిన తరువాత ఆ వుండలు మెత్తగా అవుతాయి, ఆ తరువాత వాటిని చల్లార్చి .. ఒక డిష్ లో తీసుకొని కొద్దిగా చల్లారిన తరువాత ఇంకా మిగిలిన మిల్క్ సిరప్ పోయండి. వీటిని ఒక చిన్న బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేయండి. ఇది చూడటానికే .. కాదు రుచి చాలా బాగుంటుందని అంటున్నారు.
