సుస్థిర వాణిజ్య సూచీ 2024.. ​ 23వ స్థానంలో భారత్

తాజా సస్టెయినబుల్​ ట్రేడ్​ ఇండెక్స్​(ఎస్​టీఐ)లో 24 స్కోర్​తో భారత్​ 23వ స్థానంలో నిలిచింది. ఎస్​టీఐ–2024ను హిన్రిచ్​ ఫౌండేషన్​, ఐఎండీలు సంయుక్తంగా రూపొందించాయి. 

సూచీలో ముఖ్యాంశాలు

ఆర్థిక, సామాజిక పురోగతి, పర్యావరణ సుస్థిరత తదితర మూడు అంశాల ఆధారంగా ఈ సూచీని రూపొందించారు. 30 ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో వాణిజ్య విధానాల సుస్థిరతను అంచనా వేస్తుంది. 
    
సూచీలో 1. న్యూజిలాండ్​, 2. యునైటెడ్​ కింగ్​డమ్​, 3. ఆస్ట్రేలియా, 4. సింగపూర్​, 5. జపాన్​ టాప్​ పెర్ఫార్మర్స్​​గా నిలిచాయి.
    
భారతదేశం గణనీయమైన ఆర్థిక వృద్ధిని సాధించినా, సామాజిక పురోగతి, పర్యావరణ సుస్థిరతలో సవాళ్లను ఎదుర్కొంటుండటంతో 23వ స్థానంలో నిలిచింది.