డ్రగ్స్ వ్యవహారంలో ఎలన్ మస్క్కు ఇండియా నోటీసులు.. భారత్లో స్టార్ లింక్ లాంచ్కు గండం

హైదరాబాద్, వెలుగు: శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థను భారత్ లో ప్రారంభించాలనే ప్లాన్ లో ఉన్న ఎలన్ మస్క్కు భారత పోలీసులు నోటీసులు పంపారు. ఇటీవల పట్టుబడిన 4.5 బిలియన్ డాలర్ల డ్రగ్స్ వ్యవహారంలో మస్క్ కు ఈ నోటీసులు అందాయి. డ్రగ్స్ సరఫరా చేసే సమయంలో స్మగ్లరు స్టార్ లింక్ కు చెందిన నావిగేషన్ పరికరాలను వినియోగించినట్లు దర్యాప్తులో తేలింది. అయితే ఆ ఇంటర్నెట్ పరికరాలను స్మగ్లర్లు ఎక్కడ కొన్నారు, ఎప్పుడు కొన్నారు.. తదితర వివరాలు తెలియజేయాలని పోలీసులు కోరారు. స్మగ్లర్లు మయన్మార్ నుంచి భారత్ కు వెళ్తున్న సమయంలో వాడిన పరికరం వివరాలను అందజేయాలని అండమాన్ నికోబార్ పోలీసులు నోటీసులు పంపినట్లు తెలిపారు. 

ALSO READ : రష్యాలో అసద్..! రాజకీయ శరణార్థిగా ఆశ్రయం కల్పించిన పుతిన్ సర్కారు

అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ వ్యవహారంలో స్టా్ర్ లింక్ డివైజ్ లను వాడుతున్నట్లు వార్తలు రావడం ఆ కంపెనీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత్ లో లాంచ్ చేసేందుకు అనుమతి పొందిన కొద్దిరోజుల్లోనే ఈ ఘటన జరగడం గమనార్హం. నవంబర్ లో మయన్మార్ నుంచి భారత్ కు వస్తున్న నౌకలో 6 వేల కేజీల డ్రగ్స్ ను అండమాన్ నికోబార్ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. అదే సమయంలో స్టార్ లింక్ కు చెందిన ఇంటర్ నెట్ పరికరాన్ని వాడినట్లు గుర్తించారు. ఈ డివైజ్ అంతర్జాతీయ జల మార్గంలో నావిగేషన్ కోసం వినియోగిస్తారని స్టార్ లింక్ ధృవీకరించింది. అయితే ఈ మొత్తం వ్యవహారం స్టార్ లింక్ ను భారత్ లో లాంచ్ చేయాలనుకున్న మస్క్ కు తలనొప్పిగా మారింది.