అంతర్జాతీయ విమానాలపై నిషేధం

అంతర్జాతీయ విమానాలపై నిషేధం

ఒమిక్రాన్ ఎఫెక్ట్ తో విదేశీ విమాన సర్వీసులపై పెట్టిన ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. రిస్క్ ఉన్న దేశాల నుంచి విమానాలను జనవరి 31 వరకు అనుమతించవద్దని నిర్ణయించింది. మరో వైపు డెయిలీ వచ్చే కమర్షియల్ విమానాలపై నిర్ణయం అమలులో ఉంటుందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా అలారం మోగిస్తున్న ఒమిక్రాన్ వైరస్ తో అలర్ట్ ఉండేందుకు ఎయిర్ బబుల్ డీల్ కింద వాయిదా వేసింది కేంద్రం. ఈనెల 15 నుంచే అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభంకావాల్సి ఉన్నా.. పలు దేశాల్లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుంటంతో విదేశీ విమానాలను నిలిపివేసింది. నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు డీజీసీఏ సర్క్యులర్ జారీ చేసింది.  జనవరి 31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం విధించింది కేంద్రం. అయితే ఇంటర్నేషనల్ అన్ని కార్గో సర్వీసులపై, ప్రత్యేక అనుమతి పొందిన కార్గో విమానాలకు ఈ నిషేధం వర్తించదు.

ఎంపిక చేసిన కొన్ని దేశాలకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. తాజాగా వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ కేసుల ప్రభావం అంతర్జాతీయ విమాన సర్వీసులపై తీవ్రంగా ఉంది. దీంతో ప్రయాణీకులకు ఇతర దేశాలు సైతం కొత్త పాలసీలు ప్రకటించాయి. ఎయిర్ పోర్టుల్లోనే టెస్టలు చేయించడం, హోం క్వారంటైన్ కు పంపడం చేస్తున్నాయి. ఇదే ప్రాసెస్ లో ఢిల్లీ ఎయిర్ పోర్టులో కూడ అమలు చేశారు. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా టెస్టులు చేయడం కోసం దాదాపు 20 కౌంటర్లను ప్రత్యేకగా కేటాయించారు. ఒమిక్రాన్ ఎఫెక్ట్ ఉన్న దేశాల నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ టెస్టు తప్పనిసరి చేశారు అధికారులు. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ర్యాండమ్ గా హోం క్వారంటెయిన్ లో ఉండాలని కేంద్రం ఆదేశించింది.