డైలీ విత్ డ్రా లిమిట్ ను పెంచిన ఇండియా పోస్ట్

డైలీ విత్ డ్రా లిమిట్ ను పెంచిన ఇండియా పోస్ట్

ఇండియా పోస్ట్ తన పోస్ట్ ఆఫీసు ఖాతాదారుల కోసం మరో నిర్ణయం తీసుకుంది. తన ఖాతాదారుల డైలీ విత్ డ్రా లిమిట్ ను పెంచింది. ఇండియా పోస్ట్ తీసుకోచ్చిన కొత్త రూల్స్ ప్రకారం.. ఇప్పుడు ఖాతాదారులు గ్రామీణ డాక్ సేవ శాఖలో ఒక రోజులో రూ.20 వేల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. అంతకుముందు విత్ డ్రా లిమిట్ 5వేల రూపాయలుగా ఉండేది. ఇండియా పోస్ట్ తన కొత్త మార్గదర్శకాలలో తెలిపిన ప్రకారం ఏ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(BPM) ఒక రోజులో ఒక ఖాతాలో 50 వేల రూపాయల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ గా స్వీకరించరాదని తెలిపింది. అంటే ఒక ఖాతా ద్వారా 50వేల రూపాయల కంటే ఎక్కువ నగదు లావాదేవీలు ఒక రోజులో చేయలేము.

అంతేకాదు..పోస్టాఫీసు పొదుపు పథకంపై 4% వడ్డీ లభిస్తుంది. తపాలా కార్యాలయ పొదుపు పథకం ఖాతాలో కనీసం రూ.500 బ్యాలెన్స్ ఉంచాల్సి ఉంటుంది. అయితే కనీస బ్యాలెన్స్ రూ.500 కంటే తక్కువగా ఉంటే ఖాతా నిర్వహణ చార్జీల కింద జరిమానాగా రూ.100 వసూలు చేస్తారు.