కొట్టుకున్న ఇండియా - నేపాల్ ఆటగాళ్లు.. బెంగళూరులో ఘటన

కొట్టుకున్న ఇండియా - నేపాల్ ఆటగాళ్లు.. బెంగళూరులో ఘటన

భారత ఫుట్‌బాల్ జట్టు సాధిస్తున్న విజయాలు ఎంతటి కీర్తిని గడిస్తున్నాయో.. వారు పెట్టుకుంటున్న గొడవలు అదే స్థాయిలో పరువును బజారు కీడుతున్నాయి. వరుసగా రెండో మ్యాచులోనూ భారత ఆటగాళ్లు గొడవపడ్డారు. రెండ్రోజుల క్రితం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచులో ఎంతటి వివాదం చోటుచేసుకుందో అందరకీ విదితమే. ఆ మ్యాచుకు గెలుపుకంటే.. గొడవతోనే ఎక్కువ గుర్తింపు దక్కింది. 

తాజాగా నేపా‌తో జరిగిన మ్యాచులోనూ భారత ఆటగాళ్లు గొడవ పడ్డారు. బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో 64వ నిమిషంలో ఈ గొడవ చోటు చేసుకుంది. భారత ప్లేయర్ రాహుల్ భేకె.. నేపాల్ ఆటగాడు బిమల్ ఘర్తీ ఇద్దరూ హెడర్ కోసం ప్రయత్నించగా... భేకె కింద పడిపోయాడు. దీంతో కోపం వచ్చిన భేకె.. మగర్ వైపు దూసుకెళ్లాడు. క్షణాల్లో ఇరు జట్ల ఆటగాళ్లు దూసుకురావడంతో ఒకరినొకరు తోసుకుంటూ కింద పడ్డారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ఈ మ్యాచులో భారత్ 2-0తేడాతో విజయం సాధించింది.

India Nepal Clash on Field.#SAFFChampionship2023 #IndianFootball #INDNEP #indvsnep pic.twitter.com/8FAnAzM8bA

— T Sports (@TSports_bd) June 24, 2023

మరిన్ని వార్తలు